Home Unknown facts రాతి స్తంభాలోనుండి సంగీతం వినిపించే శివాలయం

రాతి స్తంభాలోనుండి సంగీతం వినిపించే శివాలయం

0

సంగీతంలో సప్త స్వరాల గురించి ప్రత్యేకించి ప్రస్తావించవలసిన అవసరం లేదు. కానీ హంపి విట్టల దేవాలయంలో మాత్రం సరిగమల స్థంబాలకు చాలా విశిష్టత ఉంది. భారతదేశం, వేద నాగరికత గల గొప్ప చరిత్రతో కూడిన పురాతన దేశం. చరిత్రను అనుసరిస్తే ఇక్కడ అడుగడుగునా అనేక దేవాలయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని దేవాలయాలు ఇప్పటికీ నమ్మశక్యం కాని రహస్యాలతో ముడిపడి ఉంటాయి. సైన్స్ కు కూడా అంతుచిక్కని ఈ ఆలయాల గురించి తెలుసుకోవడం, ఆ ప్రదేశాలకు పర్యటించడం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి పురాతన ఆలయం వెనుక ఒక్కో ఆసక్తికర కథ ఉంటుంది. అలాంటిదే కర్ణాటకలోని చారిత్రక హంపి నగరంలో శ్రీ విజయ విట్టల దేవాలయం.

nellaiappar Templeశిథిలమైన విట్టల బజార్ కు చివరిలో ఉన్న ఈ ఆలయానికి హంపిలోని అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు. 15వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ ఆలయంలో రంగ మండప పేరుతో 56 సంగీత స్తంభాలు ఉన్నాయి. వీటినే స-రి-గ-మ స్తంభాలు అని కూడా అంటారు. ఎవరైనా ఈ స్తంభాలపై కొట్టినప్పుడు పాశ్చాత్య శైలిలోని సంగీత స్వరాలు వినిపిస్తాయి.

దేవరాయ 2 పరిపాలనలో 15వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. విజయనగర సామ్రాజ్య పాలకుల్లో ఈయన ఒకరు. ఈ ఆలయాన్ని విట్టలకు అంకితం చేశారు. దీనిని విజయ విట్టల ఆలయం అని కూడా పిలుస్తారు. విట్టలను విష్ణువు అవతారం అని అంటారు. ఇతిహాసాల ప్రకారం శ్రీమహావిష్ణువు విట్టల రూపానికి ఈ ఆలయాన్ని నిర్మించారు. కానీ ఈ ఆలయం చాలా గొప్పగా ఉన్నట్లు అనిపించడంతో విష్ణువు ఎంతో నిరాడంబరమైన పందర్ పూర్ కు విట్టల రూపంలో వెళ్లిపోయినట్లు చెబుతారు. హంపిలోని విట్టల ఆలయంలో విగ్రహం ఉండకపోవడాన్ని మీరు గమనించవచ్చు.

ఈ ఆలయంలో రధం, సంగీత స్తంభాలు వంటి అందమైన రాతి నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ నిర్మాణాల హస్తకళ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీటిని సందర్శించేందుకు ప్రపంచ నలుమూల నుంచి పర్యాటకులు వస్తుంటారు. విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక హంపి నగరం అయితే హంపి నగరం యొక్క వైభవానికి ప్రతీకగా ఈ విట్టల దేవాలయం గురించి చెప్పుకోవచ్చు. తుంగభద్ర నది ఒడ్డున దక్షిణం వైపున ఉన్న ఈ దేవాలయం హంపి నగరం లో ఎక్కువగా సందర్శించబడే ప్రాంతం. రెండవ దేవరాయ కాలం లో నిర్మించబడిన ఈ దేవాలయం 16 వ శతాబ్దానికి చెందినది.

Exit mobile version