Home Health డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ ఒకేసారి చేస్తే ఎముకలకు ప్రమాదమా ?

డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ ఒకేసారి చేస్తే ఎముకలకు ప్రమాదమా ?

0

మారుతున్న జీవన విధానంలో బరువు పెరగడం అనేది సాధారణంగా మారిపోయింది. ఆహారపు అలవాట్లు, పద్ధతులు మారడం అధిక బరువుకి దారి తీస్తున్నాయి. నాణ్యత లేని ఆహరం, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా ఇందుకు కారణం కావొచ్చు. కారణాలు ఏవైనా ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా తగ్గాల్సిందే. అధిక బరువు ఎప్పటికీ మంచిది కాదు. అయితే… ఒబెసిటీ కంట్రోల్ అనగానే మనవాళ్ళు చెప్పే మొదటి మాట అన్నం తగ్గించి చపాతీ తినండి అని. లేదంటే ఒక పూట తిండి మానేయండని.
కానీ ఈ రెండూ సరైన పద్ధతులు కాదు. నిజానికి ఒబెసిటీ కంటే డైటింగే ప్రాణాంతకం అంటున్నారు డాక్టర్లు. బరువు తగ్గేందుకు కొన్ని ఆరోగ్య పద్ధతులు పాటించాలి. చాలా మంది త్వరగా బరువు తగ్గాలనే ఆలోచనతో… డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ ఒకేసారి చేస్తుంటారు. ఇది ఎముకలకు ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Is it dangerous for the bones to do both dieting and exercise at the same time?ఎందుకంటే… డైటింగ్ వల్ల… శరీరానికి పోషకాలు అందించాల్సిన ఆహరం తగ్గిపోతుంది. అదే సమయంలో ఎక్సర్‌సైజ్ చేస్తే… శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా… కండరాలతోపాటూ… ఎముకలకు కూడా కావాల్సినంత పోషకాలు అందవు. ఒకే సమయంలో పెద్ద మొత్తంలో పోషకాలు తగ్గిపోతే… ఎముకల్లో పటుత్వం తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో మహిళలు ఎక్కువ జాగ్రత్త పడాలి. మన ఏజ్ పెరుగుతున్నకొద్దీ సహజంగానే ఎముకల్లో బలం తగ్గిపోతుంది. బలం పెంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది.

పైగా రోజూ తీసుకునే ఫుడ్ క్వాంటిటీని ఒక్కసారిగా తగ్గిస్తే మెటబాలిజం రేట్‌‌లో తేడా వస్తుంది. దీంతో శరీరంలోని అత్యంత కీలకమైన గట్‌‌ బ్యాక్టీరియా పనితీరు దెబ్బతింటుంది. డైటింగ్‌‌ చేసేవారి పొత్తికడుపు భాగంలో నిల్వ అయ్యే కొవ్వు లిమిట్ దాటుతుంది. ఇది గుండెజబ్బు, షుగర్‌‌‌‌కి దారితీస్తుంది. ప్లానింగ్ లేని డైటింగ్‌‌ వల్ల మెదడులోని నాడీకణాల్లో సెరటోనిన్‌‌ అనే రసాయనం ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా భావోద్వేగాలు, ఆకలి, నిద్ర వంటి వాటిపై వారు అదుపు కోల్పోయే అవకాశాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు.

ఇక డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ ఒకేసారి చేసేవారిలో… ఎముకల మధ్యలో ఉండే బోన్ మ్యారో ప్యాన్ పెరిగిపోతోంది. సరైన పోషకాలు అందకపోవడంతో ఎముకలు… ఫ్యాట్‌తో నిండిపోతున్నాయి. ఇది ఎముకల పటిష్టతను దెబ్బతీస్తుంది. 30 ఏళ్ల వయసుండే మహిళలు… రోజుకు 2,000 కేలరీల శక్తికి సరిపడా ఫుడ్ తినాల్సి ఉంటుంది. కానీ డైటింగ్ చేసేవారు… 30 శాతం తక్కువ ఆహారం తీసుకుంటున్నారు. దానివల్ల కేలరీల సంఖ్య 1400కి పడిపోతోంది. ఫలితంగా మహిళలు వారానికి 450 గ్రాముల బరువు తగ్గిపోతున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో ఎముకలకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు పరిశోధకులు. అందుకే డైటింగ్ చెయ్యడం మానేసి… మంచి ఆహారం తింటూ… ఎక్సర్‌సైజ్ చెయ్యడం మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Exit mobile version