హనుమంతుడు కేవలం బలశాలి మాత్రమే కాదు ధర్మాన్ని, సత్యాన్ని పాటించే ఒక గొప్ప రామ భక్తుడు. ప్రతి ఊరిలో తప్పకుండ హనుమంతుడి ఆలయం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న ఈ ఆలయంలో మాత్రం హనుమంతుడు ఒక కంటితో చూస్తూ భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ స్వామి అక్కడ ఆలా ఒక కంటితో కొలువై ఉండటానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, గుంతకల్ మండలంలో కసాపురం అనే గ్రామము కలదు. ఈ గ్రామము నందు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయం ఉంది. ఇది చాల పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని స్వామివారిని నెట్టికంటి స్వామి అని, కసాపురం ఆంజనేయస్వామి అని భక్తులు పిలుస్తారు. ఆ స్వామిని దర్శిస్తే సకల పాపాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. మనసులో అనుకున్న కోర్కెలు నెరవేరుతాయని, ఏ పనులు ప్రారంభించినా విఘ్నం లేకుండా ముందుకు సాగుతాయని, సర్వరోగాలు నయమవుతాయని స్వామిని దర్శించటం మహాభాగ్యంగా తలుస్తారు భక్తులు.పురాణానికి వస్తే శ్రీ వ్యాసరాయలవారు తుంగభద్ర నదీతీరంలో ఉన్న హంపి క్షేత్రంలో కర్మానుష్ఠానం చేస్తూ తానూ ధరించే గంధంతో తన ఎదురుగా ఉన్న ఒక శిల మీద అంజనేయస్వామి రూపం చిత్రించగా అది నిజ రూపం ధరించి వెళ్ళిపో సాగింది. ఈవిధంగా ఐదుసార్లు చిత్రించగా ఆ విధంగానే జరిగింది. చివరకు శ్రీ వ్యాసరాయలవారు ఆంజనేయస్వామి వారి ద్వాదశనామ బీజాక్షరాలతో ఒక యంత్రం వ్రాసి దానిలో స్వామి వారి నిజ రూపం చిత్రించగా అప్పుడు స్వామి వారు ఆ యంత్రంలో బంధింపడినారు. ఒకరోజు రాత్రి వ్యాసరాయలవారికి స్వామివారు కలలో కనబడి ‘నీవు నన్ను కీర్తించి అర్చిస్తే చాలదు నా శిల ప్రతిమలు దేశంలో ప్రతిష్టలు చేయాలి’ అని చెప్పాడు. స్వామివారి ఆజ్ఞానుసారం వ్యాసులవారు క్రీ.శ.1500 సంవత్సరంలో ఈ ప్రాంతాన సుమారు 732 ఆంజనేయస్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠచేసారు. ఆ యాత్రలో భాగంగా నేటి చిప్పగిరి గ్రామంలో గల శ్రీ భోగేశ్వరస్వామి వారి దేవాలయంలో శ్రీ వ్యాసలవారు నిద్రించగా శ్రీ నెట్టి కంటి ఆంజనేయస్వామివారు కలలో కనిపించి “నేను ఇక్కడ దక్షిణ దిశగా కొద్దీ దూరంలో భూమిలో ఉన్నాను నన్ను తిరిగి ప్రతిష్టించవలసింధిగా” అని చెప్పగా, తమరు ఉన్న ప్రదేశాన్ని కనుగొనే మార్గం తెలియజేయమని కోరగా, ఆ స్వామివారు “ప్రస్తుతం నాపైన ఎండిన వేపచెట్టు ఉంది. నీవు అక్కడికి రాగానే అది పచ్చగా చిగురిస్తుంది” అని మార్గం చెప్పారు.తెల్లారిన తరువాత వ్యాసలవారు కసాపురానికి వచ్చి దారిలో ఉన్న ఆ స్వామివారి మీద ఉండే వేపవృక్షానికి సమీపించగానే అది పచ్చగా చిగురించింది. వెంటనే ఆ ప్రదేశాన్ని తవ్వించి శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించారు. నెట్టికల్లు అంటే మంచి రాయి అని అర్ధం. ఇంకా ఒక కన్ను కలవాడని కూడా అంటారు. విగ్రహంలో స్వామి కుడి కంటితో భక్తులను చూస్తూ వారి కోరికలను నెరవేరుస్తున్నారు. స్వామివారి దివ్యమంగళ సుందర రూపాన్ని అభిషేక సమయంలో నిజరూప దర్శనంలో మనం చూడవచ్చును. ఈ విధంగా హనుమంతుడి ఒక కంటితో నెట్టికంటి ఆంజనేయస్వామి గా అవతరించాడు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.