Home Unknown facts గంగా మొట్టమొదటిసారిగా భూమిపైనా పొంగి పొరలి ప్రవహించిన ప్రదేశం

గంగా మొట్టమొదటిసారిగా భూమిపైనా పొంగి పొరలి ప్రవహించిన ప్రదేశం

0

మన దేశంలో ఉన్న నదులన్నింటిలో గంగానది పరమ పవిత్రమైన నది. ఈ నది స్వచ్ఛతకు నిదర్శనం. మనం చేసిన పాపాలను ఈ నది ప్రక్షాళనం చేస్తుంది. భగీరథుడి తీవ్ర తపశ్శక్తి ద్వారా గంగ ఉద్బవించింది. అయితే శివజటాజూటల్లో నుండి విముక్తి పొందిన గంగా మొట్టమొదటిసారిగా భూమిపైనా పొంగి పొరలి ప్రవహించిన ప్రదేశం ఇదేనని పురాణాలూ చెబుతున్నాయి. మరి గంగానది జన్మస్థలం ఎక్కడ? ఈ పవిత్రస్థలంలో దాగి ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

origin of holy river Ganga

ఉత్తరాంచల్ రాష్ట్రం, హిమగిరి కొండల్లో, సముద్రమట్టానికి సుమారు నాలుగు వేల మీటర్ల ఎత్తులో 24 కి.మీ. పొడవు, నాలుగు కిలోమీటర్ల వెడల్పుతో బల్లపరుపు ఆకారంలో ఉన్న కొండని గంగోత్రి గ్లేసియర్ అని పిలుస్తారు. ఈ మంచుకొండ మీద ఉన్న ప్రదేశాన్ని గోముఖి అని పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం, గోముఖం గంగానదికి జన్మస్థలం అని తెలియుచున్నది. ఇక్కడే శివలింగ పర్వతం, మేరుగిరి వంటి శిఖరాలు ఉన్నవి. ఇక్కడి నుండి చుస్తే, కేదార్నాథ్ పర్వతాలు, శివలింగ పర్వతం చాలా స్పష్టంగా కనిపిస్తాయి.

origin of holy river Ganga

గోముఖం నుండి గంగోత్రి వరకు ప్రవహిస్తున్న వచ్చిన ఈ గంగానది ప్రవాహం తల్లి గర్భంలో నుంచి అప్పుడే భూమి మీద పడిన శిశువు వంటిది. అంటే గోముఖం నుండి ఈ గంగోత్రి చేరేవరకు ఈ ప్రవాహంలో నీటికి ఎక్కడ మానవ స్పర్శ అంటదు. అందువల్ల రామేశ్వరంలోని రామేశ్వరస్వామికి చేసే నిత్యాభిషేకం ఈ గంగోత్రి నుండి తీసుకువచ్చిన నీటితోనే చేస్తారు. ఇక స్నానఘట్టాలకు పైన అంటే నది ఒడ్డున ఉన్న ప్రధాన విధి చివరగా గంగామాత పవిత్ర ఆలయం ఉంది.

origin of holy river Ganga

ఇక ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఎన్నో పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. అందుకే దీనిని దేవభూమి అని పిలుస్తారు. ఈ రాష్ట్రంలోని ఘర్ వాల్ ప్రాంతంలో నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవి గంగోత్రి, కేదార్ నాథ్, బదరీనాధ్, యమునోత్రి . ఈ నాలుగు క్షేత్రాలను కలిపి చార్ ధామ్ అంటారు. ఇక చార్ ధామ్ యాత్రలో సులభతరంగా చేరగలిగే ప్రదేశం గంగోత్రి. ఈ ప్రముఖ క్షేత్రం ఉత్తరాంచల్ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 3750 మీ ఎత్తున హిమాలయ పర్వత శ్రేణులలో భగీరథి నది ఒడ్డున ఉంది.

ఇక గంగోత్రిని దర్శించిన యాత్రికులంతా కూడా మరొక 18 కి.మీ. నడిస్తే వచ్చే గోముఖ క్షేత్ర దర్శనం ఒక అద్భుతం అని చెప్పవచ్చు.

Exit mobile version