Home Health మొటిమలు రాకూడదు అంటే ఈ పదార్థాలు తినడం మానేయాలి!

మొటిమలు రాకూడదు అంటే ఈ పదార్థాలు తినడం మానేయాలి!

0

ఒక వయసు వచ్చాక ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య మొటిమలు. ఈ రోజుల్లో మొటిమలులేని వారు చాలా తక్కువ మంది ఉంటారు. సాధారణంగా మొటిమలు రావడానికి కారణం ఒత్తిడి, హార్మోన్లలో అసమతుల్యత, లేదా తీసుకొనే ఆహార పదార్థాలు కూడా కావొచ్చు. మరి ఆహార పదార్థాలు తినడం వలన మొటిమలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Pimplesచాల మంది భోజనంలోకి ఫ్రైలు చేసుకొని తింటూ ఉంటారు. అవి చర్మంపై వాపును కలిగించటానికి కారణం అవుతాయి. అది మొటిమలు రావడానికి కారణం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బంగాళ దుంప చిప్స్, ఫ్రాంచ్ ఫ్రైస్, బాగా వేయించిన ఆయిల్ ఫుడ్స్ తీసుకోవటం మానేయటమే మంచిది.

జున్నులో ప్రొజెస్టెరాన్ సమృద్ధిగా ఉండుట వలన కొవ్వు ఉత్పత్తి గ్రంధులను అధిక మొత్తంలో పెంచుతుంది. దీనితో చర్మం జిడ్డుగా మారి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఆహారం నుండి జున్నును తొలగించండి.

ఇక చాక్లెట్ అంటే దాదాపుగా అందరికి ఇష్టమే. తరుచూ చాక్లెట్ తినేవాళ్లు దాన్ని మానాలంటే కష్టమే. అయినా సరే మొటిమలు తగ్గాలంటే చాక్లెట్ తినటం మనాల్సిందే. చాక్లెట్ లో ఉండే కొవ్వు, చక్కెరలు మీ శరీరంపై మంటను కలిగించే సెబమ్ తైలాన్ని అధికంగా ఉత్పత్తి చేసే విధంగా ప్రోత్సహిస్తాయి. దాంతో అది మొటిమలకు కారణం అవుతుంది.

బ్రెడ్ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ స్థాయిలను తగ్గిస్తుంది. దాంతో మొటిమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్రెడ్ లో గ్లూటెన్ ఉండటం వలన అది మొటిమలను కలిగిస్తుంది. అందువల్ల బ్రెడ్ తినడం కూడా తగ్గించడం మంచిది.

Exit mobile version