Home Health పైల్స్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమా ?

పైల్స్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమా ?

0

మలద్వారం లోపల, చుట్టూ వాపువచ్చి పెరిగే కణితులనే పైల్స్, హెమరాయిడ్స్, మొలలు అంటారు. ఇవి రక్తనాళాలు, కండ మొదలైనవాటితోనే ఏర్పడే కణసముదాయాలు. ఇవి రకరకాల సైజుల్లో ఉంటాయి, మలద్వారం బయట కూడా ఇవి పెరగొచ్చు. ఇది తీవ్ర సమస్య కాదు, ఎందుకంటే సాధారణంగా వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ, గుర్తించాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మొలల సమస్యను తగ్గించుకునేందుకు ఆపరేషన్ కూడా అవసరం అవుతుంది.

Possible causes of pilesసాధారణంగా మొలలు జన్యు కారణాలు, వృద్ధ్యాప్యంకి చేరుకుంటున్నకొద్దీ ఎక్కువ అవుతుందని చెబుతారు. గర్భవతుల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. తరచుగా పొట్ట భాగంలో వచ్చే ఒత్తిడి వల్ల మలద్వారం దగ్గరి సిరలు పొంగి, వాచి మొలలుగా మారతాయి. దీనికి ఊబకాయం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరొక ముఖ్యకారణం, ఆహారపు అలవాట్లు. మన జీవనశైలిలో ఆహారం చాలా ముఖ్యమైన అంశం, అనారోగ్యకరమైన ఆహారం తినటం వల్ల అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయి. మొలలు కూడా వాటిల్లో ఒకటి. ఇతర కారణాలు తెలుసుకుందాం..

పైల్స్‌ని ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ అని రెండురకాలుగా ఉంటాయి.

ఇంటర్నల్ పైల్స్:

మలవిసర్జన మార్గంలో రక్తనాళాలు వాపుకు గురవడం వలన ఇది ఏర్పడుతుంది. ఇందులో అంత ఎక్కువ నొప్పి ఉండదు.

ఎక్స్‌టర్నల్ పైల్స్ అనగా మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపుకు, గురై వాటిపైన ఉన్న మ్యూకస్ పొర బయటికి పొడుచుకొని రావడాన్ని ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటారు. దీనిలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం ఉండవచ్చు.

ఫిషర్స్ రకం :

మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను ఫిషర్ అని అంటారు. ఇది చాలా నొప్పి, మంటతో కూడి ఉంటుంది.

కారణాలు :

కాలేయ సంబంధిత సమస్యలు :

కాలేయ సంబంధిత వ్యాదులతో బాధపడే వారిలో పైల్స్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడి, వాటిలోని కవాటాలు దెబ్బతినడం, రక్తనాళాలు సాగదీతకు గురై, అందులో రక్తం నిల్వ ఉండడం వలన మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గర వత్తిడి ఏర్పడుతుంది. దాంతో తీవ్రమైన నొప్పి వచ్చి, రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది.

మలబద్ధకం :

దీర్ఘకాలికంగా మలబద్దకం ఉండి మలవిసర్జన సమయంలో వత్తిడి ఏర్పడి మలద్వారం ద్వారా ఫిషర్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ కాలం విరేచనాలు ఉండడం వలన, కూడా ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది.

గర్భధారణ సమయంలో :

గర్భధారణ సమయంలో కూడా పైల్స్ ఏర్పడే అవకాశం ఉంది.

క్రాన్స్,అల్సరేటివ్ వ్యాధులు :

క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కాలరైటివ్స్ జబ్బులతో బాధపడే వారిలో మొలలు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఊబకాయం :

గంటల తరబడి కదలకుండా ఒకేచోట కూర్చొని పనిచేసేవారిలో ఊబకాయం తద్వారా తీవ్రమైన మలబద్దకంతో బాధపడే వారిలో మొలలు వచ్చే అవకాశం ఉంటుంది.

Exit mobile version