Home Health పాలు ఇచ్చే తల్లులు సమృద్ధిగా పాలు పడాలి అంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి ?

పాలు ఇచ్చే తల్లులు సమృద్ధిగా పాలు పడాలి అంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి ?

0

కొంత మంది తల్లులు తమ పిల్లలకు సరిపోయేన్ని పాలు ఇవ్వలేకపోతున్నామని మధన పడిపోతుంటారు. పోతపాలకు అలవాటు చేస్తుంటారు. వారికి పోతపాలు పట్టక పడే ఇబ్బందులు చాలా ఇళ్ళలో నిత్యకృత్యాలే. ఇలాంటి సమయంలో పాలిచ్చే తల్లులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమృద్ధిగా పాలు పడతాయి. చిన్న పిల్లల తల్లులలో పాల ఉత్పత్తికి మెంతులు చాలా ఉపయోగపడుతాయి. బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాలు ఉత్పత్తి పెరుగుతుంది.

పాలు ఇచ్చేతల్లిపాలు తాగే ఎవరైనా సరే ఆరోగ్యంగా పెరుగుతారు. బాలింతలకు మెంతులతో తయారు చేసిన పదార్థాలను తినిపించడం దేశ వ్యాప్తంగా ఉంది. ఉత్తర భారతదేశంలో బాలింతలకు మెంతి హల్వా పెడతారు. మెంతులను నేతిలో వేయించి, మెత్తగా చూర్ణంచేసి, దానికి సమానంగా గోధుమ పిండిని కలిపి,తగినంత పంచదార వేసి హల్వా తయారు చేస్తారు.

బాలింతలకు బొప్పాయి కల్పతరువులాంటిది. బొప్పాయి, బొప్పాయికాయ దోరగా ఉన్నదాన్ని కొబ్బరి కోరులా చేసి కూరవండుకుని తిన్నట్లయితే స్తన్యవృద్ధి కలుగుతుంది. తన పాలు దోషయుక్తంగా ఉండి బిడ్డకు వికారం, విరేచనాలు కల్గిస్తున్నప్పుడు, బొప్పాయి కాయనుగానీ పండునిగానీ తీసుకోవడం మంచిది.

పాల ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని మార్గాలున్నాయి. ఆవుపాలు, కర్బూజాపండు, పాలకూర, జీలకర్ర. బార్లీజావ, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, ములగాకు కూరలు చాలా మేలు చేస్తాయి. పట్టణ ప్రాంతాలలోని వారికి పిల్లిపెసర దొరకపోవచ్చు. కాని దాని వేళ్ళను దంచిన రసం తీయాలి. దీనిని ఎండించి దంచిన చూర్ణం రోజూ తేనెలో తీసుకుంటే పాలు పెరుగుతాయి.

2 గ్లాసుల నీళ్ళలో 2 టీస్పూన్ల పత్తిగింజల పొడి పోసి మరిగించాలి. ఈ నీళ్ళు అరగ్లాసు అయ్యేలా చేయాలి. దీనిని వడగట్టి తేనె కలుపుకుని తాగితే పాలవెల్లువ కల్గుతుంది. తామర కాడను ఎండించిన చూర్ణం చెంచాని తేనెతో కలిపి రోజుకు మూడుసార్లు తింటే పాలు పెరుగుతాయి. ఆముదం ఆకులపైన ఆముదాన్ని రాసి వెచ్చ చేసి రొమ్ములకు కడితే పాలచేపు వస్తుంది.

బాలింతలకు వాము కషాయం రోజూ తేనెతో తీసుకుంటే చక్కని పాలు పడతాయి. అంతే కాదు గర్భాశయం త్వరగా కుంచించుకుంటుంది. గర్భాశయంలో నొప్పి తగ్గుతుంది. మైల త్వరగా పడిపోతుంది. శనగలను మొలకలొచ్చేదాకా నాన బెట్టాలి. ఎండించి, పొట్టు తీసి, దోరగా వేయించి, అప్పుడు కట్టులా కాచుకుని తాగితే బలాన్నిచ్చి మంచి ఔషధంగా పనిచేస్తాయి.మంచి రక్తాన్ని పుటిస్తాయి. పాలిచ్చే తల్లులకు ఇస్తే పాలు పెరుగుతాయి.

పాలు పట్టేప్పుడు సౌకర్యవంతంగా ఉండడం చాలా ముఖ్యం. అవసరమైతే తల్లి మెత్తని దిండ్లను ఉపయోగించవచ్చు. పాలు పట్టేప్పుడు తల్లి చేతులు, భుజాలు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉండాలి. పిల్లల మెడ, భుజాలు, వెనుక భాగాలకు చేతితో ఊతం ఇవ్వాలి. పాలు పట్టేటప్పుడు పిల్లవాడి మీద పడకూడదు.

 

Exit mobile version