Home Health కళ్ల కింద ముడతలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కళ్ల కింద ముడతలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0

ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో కూడా కళ్ల కింద ముడతలు పడడం చూస్తూనే ఉన్నాం. నిద్ర సరిగ్గా లేకపోయినా, ఆరోగ్యం బాగా లేకపోయినా మొదట ఆ ప్రభావం కళ్ళ కిందే కనిపిస్తుంది. కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇక వయసు పెరుగుతున్న వారిలో కళ్ల కింద చర్మం సాగిపోయి, ముడతలు సాధారణ విషయమే. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇలా ముడతలు రాకుండా చూసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Precautions to prevent wrinkles under the eyesచాలామందికి అస్తమానూ కళ్లను నలుపుకునే అలవాటు ఉంటుంది. ఇలా రబ్ చేసుకుంటూ ఉండటం వల్ల కళ్ల చుట్టూ ఉండే చర్మం ముడతలు పడిపోతుంది. సన్నని గీతలు ఏర్పడతాయి. దీనివల్ల అసలు వయసు కంటే ఎక్కువ వయసున్న వారి లాగా కనిపిస్తారు. కాబట్టి కళ్లు అస్తమానూ నులుముకునే అలవాటు ఉంటే దాన్ని మానుకోవడం మంచిది.

సాధారణంగా ముఖానికి బ్యూటీ ప్రొడక్ట్స్ అప్లై చేసినప్పుడు కళ్ల చుట్టూ వదిలేస్తాం. అలా వదిలేయడం వలన కళ్ల కింద చర్మం నల్లగా మారి ముడతలు పడిపోతుంది. అందుకే వీలైనప్పుడల్లా కళ్ల కింద చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసుకోవడం ద్వారా కూడా క్యారీబ్యాగులు రాకుండా చూసుకోవచ్చు.

సూర్యరశ్మి ప్రభావం వల్ల కూడా కళ్ల కింద చర్మం నల్లగా, వదులుగా మారిపోతుంది? కాబట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ఓ పది నిమిషాల ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం జింక్ ఆక్సైడ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ఎంచుకుంటే కళ్లు మండకుండా ఉంటాయి.

మనం రోజూ తాగే కాఫీ, టీ, పంచదార కలిపిన జ్యూస్ లు, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి వాటిని తగ్గించాలి. వీటిని పరిమితికి మించి ఎక్కువగా తాగడం వల్ల కళ్ల కింద చర్మం ఉబ్బినట్టుగా తయారవుతుంది.

ఉప్పు ఎక్కువగా తిన్నా కూడా కళ్ల కింద చర్మం వదులుగా తయారవుతుంది. కాబట్టి ఆహారంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు, అరటి పండు ఎక్కువగా తినడం ద్వారా కళ్ల కింద క్యారీ బ్యాగులు రాకుండా చూసుకోవచ్చు.

 

Exit mobile version