Home Health గర్బీణీలు బలపాలు తినడం వలనే ఎదురయ్యే సమస్యలు

గర్బీణీలు బలపాలు తినడం వలనే ఎదురయ్యే సమస్యలు

0

పిల్లల్లో చాలామంది బలపాలు, చాక్ పీస్ లు తింటూ ఉంటారు. తల్లిదండ్రులు వాటిని తినకూడదని సూచించినా కొందరు పిల్లలు వాటిని తింటూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. పిల్లలతో పాటు గర్భవతులైన మహిళలు, కొందరు పురుషులు కూడా బలపాలు, చాక్ పీస్ లను తింటూ ఉంటారు. ఈ సమస్యను పీకా అంటారు. దీనికి గనుక సరిగ్గా ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే భవిష్యత్‌లో అది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్‌కి దారి తీయొచ్చు.

Problems caused by pregnant women eating forcepsఅయితే రెండేళ్ల లోపు పిల్లలు బలపాలు, చాక్ పీస్ లు తింటే ఆ సమస్యను తీవ్రంగా పరిగణించకూడదు. ఎందుకంటే ఆ వయసు లో వాళ్ళకి అది సహజమే. ఏది తినచ్చు, ఏది తినకూడదు వాళ్ళకి తెలీదు కాబట్టి అది పీకా అవ్వదు. పీకాని డయాగ్నోజ్ చేయడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఎంత కాలంగా చాక్ తింటున్నారు, ఎప్పుడెప్పుడు తింటున్నారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా వంటి ప్రశ్నలు అడుగుతారు.

ఒకవేళ రెగ్యులర్ గా చాక్ తింటున్నట్టు తేలితే వెంటనే బ్లడ్ టెస్ట్ చేయిస్తారు. దీని వల్ల బాడీ లో పేర్కొన్న లెడ్, ఎనీమియా, వంటివి తెలుస్తాయి. ఒకవేళ ఎవరికైనా మట్టి తినే అలవాటు ఉంటే మోషన్ శాంపిల్ టెస్ట్ చేస్తారు. దీని వల్ల కడుపులో పురుగులు ఉన్నాయా లేదా తెలుస్తుంది. ఈ సమస్య ఉన్నవారు బలపాలు, చాక్‌పీస్‌లు తింటారు. వీరికి మట్టీ, చాక్ పీసులు, ఐస్ వంటి వాటిని చూడగానే నోరూరిపోతుంటుంది. ఇది ఒక ఈటింగ్ డిసార్డర్ గా చెప్పొచ్చు.

ఓసీడీ ఉన్నవారూ, పోషకాహారలేమితో బాధపడుతున్నవారూ, ప్రెగ్నెంట్ గా ఉన్న వారూ కూడా ఇలా తింటారు. ఒక్కోసారి బాడీ లో అవసరమైనంత జింక్ లేకపోయినా కూడా ఈ పీకా సమస్య వస్తుంది. చాక్‌పీస్‌లు, బలపాల పెద్ద విష పదార్ధం కాదు. కానీ దాన్ని తినటం మంచిది కాదు. దాని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా ప్రెగ్నెంట్స్ గానీ, ఫీడింగ్ మదర్స్ కానీ వీటిని తింటే దాని వల్ల వచ్చే నష్టాలు తీవ్రంగా ఉంటాయి. వారికి సరిగా ఆకలి కాక, అన్ని రకాలా ఆహార పదార్ధాలూ తీసుకోక, పోషకాహార లేమి వస్తుంది. ఇది వారికి మాత్రమే కాదు.. పుట్టబోయే పిల్లలకి కూడా మంచిది కాదని చెబుతున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

 

Exit mobile version