రావణాసురుడు అంటే రామాయణంలో ఒక రాక్షసుడు. అయితే లంక ప్రజలకి మాత్రం అయన ఒక గొప్ప రాజు అంతేకాకుండా ఇప్పటికి కొందరికి రావణుడు అంటే ఆరాధ్య దైవం. కానీ భారతదేశంలో కూడా ఆయనను దేవుడిగా కొలిచే కొన్ని దేవాలయాలు ఇప్పటికి ఉన్నాయి. మరి ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాకినాడ, ఆంధ్రప్రదేశ్:ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడలో రావణుని దేవాలయం అత్యంత ప్రసిద్ధమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని స్వయంగా రావణుడే నిర్మించాడు అని స్థానిక భక్తులు నమ్ముతారు. అయితే రావణుడు శివ దేవాలయం అనే స్థలాన్ని ఇక్కడ ఎంచుకొని అనంతరం శివ లింగం చుట్టూ ఆలయం నిర్మించాడని చెపుతారు. ఈ ఆలయం బీచ్ కి దగ్గరగా ఉంది. ఇది ఒక అందమైన ఆలయం. ఇక్కడ అద్భుతమైన రావణుని విగ్రహాన్ని చూడవచ్చును. ఆంధ్ర ప్రదేశ్ లో రావణున్ని పూజించే ఏకైక ఆలయం ఇది.
బిస్రాక్, ఉత్తరప్రదేశ్:ఇది అత్యంత ప్రసిద్ధమైన రావణుని దేవాలయం. రావణుడిని ఈ ప్రదేశంలో దేవుడులాగా పూజిస్తారు. రావణుడి చిత్రం తగలబెట్టవలసిన కారణంగా ఇక్కడ దసరా జరుపుకోరు. ఇక్కడ భక్తులు రావణున్ని పవిత్ర దేవతామూర్తిగా పూజిస్తారు. రావణుడు ఒక శ్రేష్టమైన రాజని తలచి అనేకమంది భక్తులు ఈ ఆలయాన్ని దుఃఖించటానికి సందర్శిస్తారు. రావణునికి గౌరవ సూచకంగా నవరాత్రుల సమయంలో ఇక్కడ హోమాలు నిర్వహిస్తారు.
కాన్పూర్, ఉత్తరప్రదేశ్:కాన్పూర్లోని రావణ ఆలయం ఏడాదికి ఒకసారి మాత్రమే తెరవబడుటుంది. ఆ సమయమేమంటే దసరా పండుగ రోజున మాత్రమే. ఈ దేవాలయం శివ భక్తుడు శివ శంకర్ మరియు రావణుని శక్తి మీద నమ్మకం వున్నవాళ్ళు నిర్మించారని చెప్పుతారు. రావణుణ్ణి ఇక్కడ దైవంగా పూజిస్తారు. కానీ అతని రాక్షసత్వాన్ని మాత్రం భక్తులు పూజించరు. దేవాలయంలో రావణున్ని జ్ఞానం, ప్రతిభను మరియు రాజు యొక్క దయ మరియు కనికరాన్ని మాత్రమే భక్తులు ఆరాధిస్తారు.
విదిశ, మధ్యప్రదేశ్:విదిశ రావణ అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. రావణ పేరుతో విదిశలో ఉన్న రావంగ్రామ్ అనే గ్రామం కూడా ఉంది. ఏదైనా శుభ కార్యాన్ని లేదా ఏదైనా మహాత్యమైన రోజు కానీ ఈ రావణుని దేవాలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు. విశేషమేమంటే విదిశ ప్రజలు రావణుని దేవాలయాన్ని పెళ్లి రోజులలో మరియు ఇతర ముఖ్యమైన సంఘటనల సమయంలో సందర్శిస్తారు.
మాండోర్స్, మధ్యప్రదేశ్:మధ్యప్రదేశ్ లోని రావణుని ఆలయాన్ని అనేక మంది భక్తులు సందర్శిస్తారు. ఇక్కడున్న స్థల పురాణం ప్రకారం మండోదరిని రావణుడు ఇక్కడే వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. ఈ ఆలయం అద్భుతమైనది మరియు అందమైనది. రావణుడితో పాటు ఇతర స్త్రీ దేవతలను కూడా ఇక్కడ పూజిస్తారు. హరప్పా నాగరికత లిపిలోని పాఠాలు దేవతలను పక్కన చూడవచ్చు. కాబట్టి ఈ ఆలయం పురాతనమైనదని నమ్ముతారు.ఈ విధంగా భారతదేశంలో ఉన్న రావణుడి దేవాలయాలలో ఆయనని దేవుడిగా కొలుస్తూ భక్తులు పూజలు చేస్తున్నారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.