Home Unknown facts రావణాసురుడు కులాలకు వ్యతిరేకి అని మీకు తెలుసా?

రావణాసురుడు కులాలకు వ్యతిరేకి అని మీకు తెలుసా?

0

భారతదేశంలోని గొప్ప ఇతిహాసాలలో రామాయణం ఒకటి. విష్ణు మూర్తి రాముడిగా అవతరించినట్లు పురాణాల్లో పేర్కొన్న విషయం చాలా మందికి తెలిసిందే. మానవులకు మరియు దేవతలకు అనేక ఇబ్బందులు కలిగించిన రావణుడిని రాముడు హతమార్చాడు.

ramayanరామాయణం అంటే కేవలం రాముడు, రావణుడి మధ్య యుద్ధం మాత్రమే కాదు. అందులో మన జీవితాలకు అవసరమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలియని రహస్యాలు కూడా చాలా ఉన్నాయి. అంతేకాదు మనల్ని ఆశ్చర్యపరిచే కథలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా రావణాసురుడి గురించి తెలుసుకోవాలి…

రావణాసురుడు అంటే అందరికి రాక్షసుడు, సీతాదేవిని అపహరించాడని మాత్రమే తెలుసు. రావణాసురుడు అందరిని హింసిస్తాడని మనకు తెలుసు.

అయితే మనకు తెలియని ఎన్నో లక్షణాలు రావణాసురుడులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాల ఆశ్చర్యం కలుగుతుంది.

రావణాసురుడికి పది తలలు ఉంటాయి.
గొప్ప శివ భక్తుడు. స‌క‌ల శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, విద్యలను అభ్యసించిన తెలివైనవాడు రావణుడు.

జైన రామాయణం ప్రకారం చూస్తే సీత రావణాసురుడికి కూతురు అవుతుందట. రావ‌ణాసురుడు తన సొంత మేథాశ‌క్తితో పుష్పక విమానాన్ని త‌యారు చేశాడ‌ట‌.

శాస్త్ర, విజ్ఞాన రంగాల్లో అత‌ను ఆరితేరి ఉండ‌డం వ‌ల్లే పుష్పక విమానాన్ని రావణాసురుడు త‌యారు చేశాడ‌ని చెబుతారు. రావణాసురుడికి అలంకరణ పట్ల చాలా అభిరుచులు ఉన్నాయట.

స్త్రీల కన్నా బాగా అలంకరణ చేసుకునేవారట. రావణాసురుడు కులాలకు వ్యతిరేకి. రాజ్యంలో అందరూ సమానం అని చెప్పేవాడట. కుటుంబం అంటే చాలా ప్రేమ ఉండేదట.

ఖ‌గోళ‌, జ్యోతిష్య శాస్త్రాల్లో రావ‌ణాసురుడు దిట్ట. ఆయా శాస్త్రాల‌ను అవపోసిన ప‌ట్టిన కొద్ది మందిలో రావ‌ణుడు కూడా ఒక‌ర‌ని చెబుతారు. మ‌న దేశంతోపాటు శ్రీ‌లంక‌లోనూ కొన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టికీ రావ‌ణున్ని పూజిస్తారు.

దైవంగా ఆరాధిస్తారు. రావణాసురుడి వద్ద సీతాదేవి కొన్ని నెలల పాటు ఉండటంతో, రాముడు యుద్ధంలో రావణుణ్ణి చంపాక ఆమెకు అగ్ని ప‌రీక్ష పెట్టి ఆ తరవాతే రాముడు సీతాదేవిని స్వీక‌రిస్తాడు.

అయితే రావ‌ణుడి భార్య మండోద‌రిని వానర సేన‌లు వేధిస్తాయ‌ట‌. అయిన‌ప్ప‌టికీ రావ‌ణుడు త‌న భార్య‌కు ఎలాంటి ప‌రీక్ష పెట్ట‌కుండానే స్వీక‌రించాడని చెబుతారు. భార్య పట్ల అమితమైన ప్రేమ కలవాడు రావణుడు.

Exit mobile version