Home Health కాంతివంతమైన చర్మం కోసం రాగి పిండి ఫేస్ ప్యాక్!

కాంతివంతమైన చర్మం కోసం రాగి పిండి ఫేస్ ప్యాక్!

0

వయసు పైబడే కొద్ది ముఖం కాంతివిహీనంగా కనిపిస్తుంది. దాని నుండి చర్మాన్ని కాపాడుకోవడం కోసం మార్కెట్లో లభించే వివిధ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు.. లేదంటే పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటూ వుంటారు.. వీటికోసం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం వలన దీర్ఘకాలంలో అనేక దుష్పభవాలు చూపిస్తాయి. అదే సహజంగా వాడే పదార్థాలు చర్మాన్ని కాంతివంతంగా చేయడంతోపాటు లోపలినుండి ఆరోగ్యంగా తయారుచేస్తాయి.

beauty productsఅందుకే మన వంటింట్లోనే ఉండే సహజ పదార్థాలతో వృద్ధాప్య ఛాయలు తొలిగి పోయి ఫేషియల్ లాంటి గ్లో పొందడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖంపై ముడతలు పోయి ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే అది రాగి పిండితోనే సాధ్యపడుతుంది.

రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది. రాగులను క్రమంతప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులు మరియు పరిణతి వృద్ధాప్యంను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.

రాగి జావ‌ను తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు కూడా మనకు అందుతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ మనకు అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. మిగిలిన ధాన్యాల్లో కంటే ఇందులో కాల్షియం 5-30శాతం ఎక్కువగా ఉంది. కాల్షియం సప్లిమెంట్‌ తీసుకునే బదులు రాగులు తినడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. అందుకే వయసు పెరిగిన వారు.. చిన్నపిల్లలు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి.

రాగి పిండి ఆహారంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని మన అందరికీ తెలిసిందే. ఇది ముఖానికి వాడడం వలన కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రాగి పిండి లో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ పచ్చిపాలు కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. ఇది ఐదు నుండి పది నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. గోరువెచ్చని నీటితో కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా తయారవడం మీరే గమనిస్తారు.

పంచదార – ఒక స్పూన్, రాగిపిండి – ఒక స్పూన్, శనగపిండి – ఒక స్పూన్, ఆయిల్ ఒక స్పూన్ అన్నీ ఒక బౌల్లో కి తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి మిశ్రమం లా కలుపుకోవాలి. ముందు పాలతో ఒక కాటన్ బాల్ వేసుకొవాలి. కాటన్ బాల్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చర్మం పై ఉన్న మృత కణాలు దుమ్ము, ధూళి అంతా తొలగిపోతుంది. అప్పుడు తయారు చేసుకున్న మిశ్రమంతో ముఖంపై స్క్రబ్ చేసుకోవాలి. కాసేపు స్క్రబ్ చేసాకా చల్లటి నీళ్లతో కడగాలి.

పంచదార చర్మంపై ఉన్న మురికిని తొలగించి సహజ మెరుపును అందిస్తుంది. శెనగపిండి చర్మాన్ని కాంతి వంతం అయ్యేలా చేస్తుంది. ఆయిల్ ముఖంపై పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. స్వేద రంధ్రాలు తెరచుకొనేలా చేస్తుంది. రాగి పిండి ముఖం కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.

ఈ ఎండలకు నల్లగా మారిన చర్మాన్ని కూడా రాగి పిండి నయం చేస్తుంది. దానికోసం ఆరంజ్ పీల్ పౌడర్, గంధం, రాగి పిండి, అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసి అందులో పచ్చిపాలు లేకపోతే పుల్ల పెరుగు వేసి ఫేస్ ప్యాక్ లాగ తయారుచేసుకోవాలి అది అప్లై చేసుకొని ఒక గంట తర్వాత చల్లటి నీటితో కడుకోవాలి. అలా వారానికి రెండు సారాలు చేస్తే చాలు మీ సమస్య తీరిపోతుంది.

Exit mobile version