పవిత్రమైన రావిచెట్టును ఎప్పుడు ఎలా పూజించాలో తెలుసా ?

0
2382

రావి చెట్టు సాక్షాత్తూ కల్పవృక్షమే అని పురాణాలు చెబుతున్నాయి. దీన్నే అశ్వత్థ వృక్షమని కూడా అంటారు. వృక్షాలలో రావిచెట్టు దేవతా స్వరూపమని అంటారు. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపంగాడ భావించి పూజిస్తుంటారు. అందుకే రావిచెట్టును చూడగానే సహజంగానే పవిత్రమైన భావన కలుగుతుంది. అయితే రావిచెట్టు ప్రదక్షణ చేసేటప్పుడు ఆ చెట్టును తాకవచ్చా? అనే అనుమానం ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. ఈ పవిత్రమైన రావిచెట్టును ఎప్పుడు తాకాలి, ఎలా పూజించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Ravi Chettuఈ వృక్షాన్ని సేవించవలసిన విధానాన్ని నారదమహర్షులవారు వివరించారు. ఆ ప్రకారం శుభసుముహూర్తంలో స్నానాదులు పూర్తిచేసి శుచియై రావిచెట్టు పూజ ప్రారంభించాలి. దానికి ముందు ప్రవహిస్తున్న నీటిలో స్నానంచేసి ఉతికిన బట్టలు ధరించి విభూతిధారణ గాని, కుంకుమధారణ గాని చేయాలి.

Ravi Chettuమొదటగా గణపతిని పూజించి సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో ఏడుసార్లు అభిషేకం చేయాలి. తరువాత విష్ణుసహస్రనామం చదువుతూ గాని, మౌనంగా గాని, నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట, చివర నమస్కారాలు చేయాలి. త్రికరణశుద్ధిగా దృష్టి నిలిపి చేసినట్లయితే మంచి ఫలితం లభిస్తుంది. ఆది, మంగళవారాల్లో అశ్వత్థమును అసలు తాకకూడదు. అంతే కాకుండా సంధ్య వేళల్లో కూడా ముట్టుకోకూడదు. ఏ రోజు పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం వలన దోషం కలుగుతుంది. అందువలన కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకవచ్చని సూచిస్తున్నారు.

Ravi Chettuమనసులోని కోరికను చెప్పుకుని రావిచెట్టుకు అనునిత్యం ప్రదక్షిణలు చేసి పూజించడం వలన కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా రావిచెట్టుకు ప్రదక్షణలు చేయడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని అంటారు. ఈ చెట్టునీడన గాయత్రీ మంత్రజపం చేస్తే నాలుగు వేదాలు చదివిన ఫలితం. రావిచెట్టును స్థాపిస్తే నలభైరెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది. కొట్టవేయడం మహాపాపం.