Home Unknown facts శివుడు చెమట చుక్కతో వెలసిన పుణ్యక్షేత్రం

శివుడు చెమట చుక్కతో వెలసిన పుణ్యక్షేత్రం

0

శివుడు లింగరూపంలో దర్శనం ఇస్తుంటాడు. జ్యోతిర్లింగం అంటే శివుడిని లింగ రూపంలో ఆరాధించే చోటు అని చెబుతారు. శివుడు తన ఆత్మ శక్తిని లింగరూపంలో నింపి మన దేశంలో 12 చోట్ల స్వయంభువుగా వెలిశాడని పురాణం. వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. ఇక్కడ వెలసిన స్వామివారికి ఎంతో పురాణం ఉంది. మరి ఇక్కడ శివుడు ఎలా వెలిసాడు? శివుడు వెలసిన ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Tripurasura

మహారాష్ట్ర, పూణే జిల్లాలో భీమా శంకర్ ఉంది. ఇక్కడే భీమనాది జన్మస్థలం అని చెబుతారు. ఒక గుంట లాంటి ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ ఆలయంలో ఎనిమిది అడుగుల స్థలంలో గుంటలాంటి తొట్టి నిండుగా నేలబారుగా నీళ్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న తొట్టిలోనే భీమనాది జన్మించింది.

ఇక పురాణానికి వస్తే, శివుడు త్రిపురాసురుని సంహరించిన తరువాత ఇక్కడ సహ్యాద్రి పర్వతాల మీదకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో భీమకుడు అనే రాజు ఇటుగా వచ్చి స్వామిని చూసి భక్తితో నమస్కరించి, స్వామి నేను ఈ అడవిలో వేయడానికి వచ్చాను ఇలా వెడుతున్న సమయంలో పొరపాటున ఇద్దరు మునులను గాయపరిచాను ఆ పాపపరిహారం ప్రసాదించమని శివుడిని ప్రార్దించాడట.

అప్పుడు శివుడు సరేనని చెప్పి అతడికి అభయం ఇచ్చాడు. అయితే శివుడూ అంతకుముందే త్రిపురాసురుడితో యుద్ధం చేసి సంహరించి రావడం వలన ఆ శ్రమ కారణంగా శివుడి శరీరం నుండి చెమట ధారగా కారి, అది ఒక చిన్న ప్రవాహం లాగా మారింది. అప్పుడు శివుడి శరీరం నుండి వచ్చిన ఆ ప్రవాహానికి భీమకుడు నమస్కరించి అందులో స్నానం చేసి తన పాపం నుండి విముక్తి అయ్యాడు. ఇక అయన ప్రార్థన మేరకు శివుడు అక్కడే వెలిశాడని పురాణం.

ఇలా ఆ ప్రవాహ ధార భీమాకుని పేరు మీదుగా భిమానదిగా మారింది. ఇక ఈ ఆలయంలో ముందు వైపు ఉన్న మెట్ల మీద నిలబడి కాళ్ళు, చేతులు కడుక్కోవడం మాత్రమే చేయవచ్చు. ఆలా ఆ మెట్ల నుండి కిందకి అంటే భూగర్భం నుండి తొట్టిలోని నీరు ప్రవహిస్తూ కొండక్రింద నుండి ఎక్కడో బయట పడుతుంది. ఆ ప్రదేశమే భిమానదిగా పిలువబడుతుంది. ఇక ఈ ఆలయంలో స్వామివారికి ఐదు తలలు ఉండగా, ఇక్కడ ఒక పెద్ద నంది విగ్రహం ఉంది.

ఇలా శివుడు చెమట చుక్కతో వెలసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version