Home Unknown facts శివ పంచాయతన అని పిలువబడే అద్భుత ఆలయం ఎక్కడ ?

శివ పంచాయతన అని పిలువబడే అద్భుత ఆలయం ఎక్కడ ?

0

ఈ ఆలయంలో విశేషం ఏంటంటే శివుడు, రాముడి దర్శనం ఇస్తూ శివకేశవులు ఒక్కే అనే విధంగా భక్తులకి దర్శనం ఇస్తుంటారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్న మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

kaashiఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలోని రైల్వెస్టెషన్ కు ఎదురుగా శ్రీ కాశీవిశ్వేశ్వర మరియు కోదండ రామాలయం కలదు. ఇవి నూతనంగా నిర్మించిన ఆలయాలు. ఈ ఆలయాలు భక్తుల నిత్య పూజలతో దేదీప్యమానంగా వెలుగొందుచున్నవి. ఈ ఆలయాన్ని హోసూరు రామయ్య గారు 1929 లో నిర్మించి కాశీవిశ్వేశ్వర శివలింగాన్ని, సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలను ప్రతిష్టించారని తెలియుచున్నది.


ఇది శివ పంచాయతన ఆలయం. మధ్యభాగంలో కాశీవిశ్వేశ్వర స్వామి నైరుతి దిశలో శ్రీ మహాగణపతి, వాయువ్యదిశలో పార్వతీదేవి, ఈశాన్య దిశలో శ్రీ మహావిష్ణువు, ఆగ్నేయదిశలో సూర్యనారాయణుడు భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంతంలో అయ్యప్పస్వామి మందిరం, శ్రీ శారదాదేవి, శ్రీ త్యాగరాజస్వాముల మందిరం, ఆంజనేయస్వామి, శ్రీకృష్ణుడు, వినాయకుడు మొదలగు ఉప ఆలయాలు కలవు. కార్తీక మాసంలో ఆశ్వయుజ మాసంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ శారదాదేవి ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ఇక ప్రతి సంవత్సరం పుష్యశుద్ధి పంచమి నాడు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు, నాగులచవితి, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, గిరిజ కల్యాణోత్సవం, వసంతోత్సవం మొదలగునవి నిర్వహిస్తారు. అంతేకాకుండా కార్తీకమాసంలో లక్ష దీపారాధనలు, వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం చేస్తారు. ఈ సమయాల్లో భక్తులు ఈ ఆలయానికి అధిక సంఖ్యల్లో వస్తుంటారు.

Exit mobile version