Home Unknown facts Shivalayamlo Mundhuga evarini darshinchukovali?

Shivalayamlo Mundhuga evarini darshinchukovali?

0

శివుడు లింగరూపంలో కొలువై ఉన్న ప్రసిద్ధ దేవాలయాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. ప్రతి శివాలయంలో నవగ్రహాలు తప్పకుండ ఉంటాయి. అయితే మనలో చాలా మందికి ముందుగా నవగ్రహాల ప్రదిక్షణ చేసి ఆ తరువాత శివుడిని దర్శనం చేసుకోవాలా? లేదా శివుడ్ని దర్శించి ఆ తరువాత నవగ్రహాలను దర్శనం చేసుకోవాలా అనే సందేహం ఉంటుంది. మరి శివాలయం వెళ్ళినప్పుడు మొదటగా ఎవరిని దర్శనం చేసుకోవాలనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. shivalayamశివాలయం వెళ్ళినపుడు చాలా మంది ముందుగా నవగ్రహాలను దర్శించి ప్రదిక్షణలు చేసి కాళ్ళు కడుక్కొని అప్పుడు శివుడిని దర్శించుకుంటారు. మరికొంతమంది ముందుగా శివుడిని దర్శించుకుంటారు. అయితే ఎవరిని ముందుగా దర్శించుకున్న తప్పేమి లేదు. శివుడు ఆదిదేవుడు, పాలకుడు, కర్తవ్యాన్ని భోధించేవాడు. నవగ్రహాలన్నీ శివుడి ఆధీనంలోనే ఉంటాయని అంటారు. కాబట్టి ముందుగా శివుడిని దర్శించుకోవాలని కొందరి వాదన. నవగ్రహాలకు ప్రదిక్షణ చేసిన తరువాత తప్పనిసరిగా కాళ్ళని కడుక్కోవాలి. కానీ శివుడిని దర్శించుకున్నాక కాళ్ళు కడగకూడదు. కాబట్టి ముందు నవగ్రహములను దర్శించుకొని, ప్రదిక్షణ చేసిన తర్వాతనే శివుడిని డార్హించుకోవాలన్నది మరికొందరి వాదనగా చెబుతారు. ఏది ఏమైనప్పటికి ముందుగా ఎవరిని దర్శించుకున్నా తరువాత ఎవరిని దర్శించుకున్నా నవగ్రహాల యొక్క మరియు శివుడి యొక్క అనుగ్రహానికి ఏమాత్రం లోటు ఉండదని మన పూర్వికులు చెబుతున్నారు.

Exit mobile version