Home Unknown facts అయ్యప్ప మాల ధరించిన వారు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి!

అయ్యప్ప మాల ధరించిన వారు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి!

0

అయ్యప్ప స్వామిని హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (విష్ణువు), అప్ప ( శివుడు) అని పేర్ల సంగమంతో ‘అయ్యప్ప’ నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు.

Significance Of Ayyappa Deekshaఅయ్యప్ప దీక్ష తీసుకోవాలనుకునే భక్తుడు గురుస్వామి వద్దనుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలా ధారణ అనంతరం తన మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమలై యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది. శబరిమల కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల మద్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి.

దీక్షా సమయంలో అయ్యప్పలు పాటించవలసిన నిత్యనియమావళి :

ప్రతిదినం ఉదయమే సూర్యోదయానికి ముందుగా మేల్కొని కాల కృత్యాలు తీర్చుకుని, చన్నీళ్ళ శిరస్నానం ఆచరించి, స్వామికి దీపారాధన గావించి, స్వామి స్తోత్రాలు పఠించి తరువాతనే మంచి నీరైనా త్రాగాలి. సాయంత్రం వేళ కూడా చన్నీళ్ళ శిరస్నానం చేసి, స్వామికి దేవతార్చన జరిపి, రాత్రిపూట భిక్ష చేయాలి.

  • రోజూ ఉదయం, సాయంత్రం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించాలి.
  • నల్లని దుస్తులు మాత్రమే ధరించాలి.
  • కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగాలి.
  • మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టిపరిస్థితిలోనూ తీయరాదు.

  • అయ్యప్ప సాన్నిధ్యము చేరడానికి కనీసము 41 రోజులు ముందుగా దీక్ష ఆరంభించాలి.
  • దీక్ష కాలంలో గడ్డం గీసుకోవడం గాని క్షవరం చేయించుకోవడం గాని పనికి రాదు. గోళ్ళు కూడా కత్తిరించకోరాదు.
  • అస్కలిత బ్రహ్మచర్యము పాటించుతూ యోగిగా జీవించడం అయ్యప్పకు ఎంతో అవసరము. ఇంటిలో ఒక వేరు గదిలో వుండటం శ్రేయస్కారం. దాంపత్యజీవితము మనోవాక్కాయకర్మములలో తలవడం కూడా అపరాధం.

  • మెత్తటి పరుపులు, దిండ్లు ఉపయోగించరాదు. నేల మీద కొత్త చాప పరుచుకొని పడుకోవడం ఉత్తమం.
  • అయ్యప్పలు శవాన్ని చూడరాదు. బహిష్ట అయిన స్త్రీలను చూడరాదు. ఒక వేళా అలా చేస్తే ఒకవేళ ఇంటికి వచ్చి, పంచగంగ శిరస్నానమాచరించి, స్వామి శరణు ఘోష చెప్పిన పిదపనే మంచి నీరైనా త్రాగాలి.
  • దీక్షలో ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే మూల మంత్రమును ఎప్పుడూ జపించాలి.

  • దీక్షా సమయంలో స్త్రీల నందరిన్నీ (భార్యతోసహా) దేవతామూర్తులుగా భావించాలి.
  • తమ పేరు చివర ‘అయ్యప్ప’ అని పదము చేర్చాలి. ఇతరులను ‘అయ్యప్ప’ అని పిలవాలి. స్త్రీ అయ్యప్పలను ‘మాలికాపురం’ లేదా ‘మాతా’ అని పిలవాలి.
  • అయ్యప్పలను ఎవరైనా భిక్షకు (భోజనమునకు) పిలిస్తే తిరస్కరించకూడదు.
  • అయ్యప్పల నుదుట ఎప్పుడు విభూధి, చందనము, కుంకుమ బొట్టు ఉండాలి.

  • మద్యము సేవించడం గాని, పొగాకు పీల్చడం వంటి దురలవాటు మానుకోవాలి. తాంబూలం కూడా నిషిద్ధమే.
  • రోజు అతి సాత్వికాహారమునే భుజించాలి. రాత్రులలో అల్పాహారం సేవించాలి.
  • తరచూ భజనలలో పాల్గొనటం అత్యుత్తమం స్వామి శరణు ఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణు ఘోష జరిపితే స్వామికి అంత ప్రీతి.
  • హింసాత్మక చర్యలకు దూరంగా వుండాలి. అబద్దమాడటం, దుర్బాషలాడటం చేయరాదు. అధిక ప్రసంగాలకు దూరంగా వుండాలి.

  • ప్రతి రోజు స్వామికి అర్చన చేసి, తర్వాత ఇష్టదైవమును ప్రీతికొద్ది ధ్యానించాలి.
  • అష్టరాగాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్యలకు దూరంగా వుండాలి.
  • శక్తి కొద్ది దీక్షా సమయంలో కనీసము ఒకసారైనా నలుగురు అయ్యప్పలకు భిక్ష పెట్టడం మంచిది.
  • స్వామి వారికి కర్పూరం ప్రీతి కాబట్టి ఉదయం, సాయంత్రం కూడా కర్పూర హారతి ఇవ్వాలి.
  • దీక్షా సమయంలో వయస్సు, హోదా, అంతస్తు సర్వము మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనం చేయడానికి వెనుకాడరాదు.
  • దీక్షా సమయంలో తల్లిదండ్రులకు పాదాభివందనం చేయవచ్చు. కానీ దీక్షలేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు.

 

Exit mobile version