ఆహారం జీర్ణం అవట్లేదా? ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

0
835

అతిగా తినడం, ఆకస్మిక భోజన సమయాలు, బయట కారంగా ఉండే ఆహారాన్ని తినడం, సాధారణ షెడ్యూల్‌ లో మార్పు ఇలా ఎసిడిటి కి అనేక కారణాలు ఉన్నాయి. ఎసిడిటి అనేది ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య. ఎసిడిటి ఉంటే తిన్నవెంటనే కడుపు, ఛాతీలో మంటగా అనిపిస్తుంది. అసలు ఈ మంట ఎందుకు వస్తుందంటే ఆహారం జీర్ణం కావడానికి విడుదలయ్యే ఆమ్లాలు, రసాలూ జీర్ణాశయంలో అవసరానికి మించి విడుదల అవుతుంటాయి. దీంతో తిన్న ఆహారం ఆ ఆమ్లాలు కలసి గుండెలో మంటలా అనిపిస్తుంది.

simple solutions for indigestion problemఇంకొందరికి నోట్లో పుల్లని తెన్పులు వస్తుంటాయి. వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని కడుపులో నొప్పి ఎక్కువగా బాధిస్తుంటుంది. ఇలా ఎసిడిటి వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఛాతీ కింది ప్రాంతంలో అసౌకర్యం సాధారణ పరిస్థితులలో కొంత సమయానికి తగ్గుతుంది , కానీ కొన్ని సందర్భాల్లో ఇది చాలా భయంకరమైన నొప్పిని కలిగిస్తుంది. అసలు అజీర్తి కి కారణాలు మరియు చికిత్స చూద్దాం.

కారణాలు:

తిన్న ఆహారం అరిగేందుకు కనీసం 4 గంటల సమయం పడుతుంది. కానీ సమయం దాటకుండా తింటూ ఉంటే అజీర్తి సమస్య వస్తుంది. అవసరానికి మించి తిన్నా, వేళతప్పి తిన్నా, లేక ఆహారాన్ని నమలకుండా తిన్నా, ఒత్తిడితో తిన్నా ఇవన్నీ అజీర్తి సమస్యలకు దారితీస్తాయి.

ఇంటి చిట్కాలతో చికిత్స :

simple solutions for indigestion problemమనం తిన్న ఆహారం బాగా జీర్ణం కావాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. తిన్న తర్వాత నీల్లు తాగాలి, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. భోజనానికి, భోజనానికి మధ్య మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ సమయం పాటించటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు అస్థవ్యస్థమవుతుంది. అలాగే ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి.

అజీర్తితో అసిడిటీ, మలబద్దకం, ఆకలి మందగించడం, వంటి సమస్యలు కూడ వేధిస్తాయి. అజీర్తి సమస్యకు సులువైన పరిష్కారాలు

బెల్లం:

simple solutions for indigestion problemఅసిడిటీ సమస్య బాధిస్తుంటే చిన్న బెల్లం ముక్కను బోజనం చేసిన తర్వాత ప్రతిసారి నోట్లో వేసుకుని చప్పరిస్తే త్వరగా జీర్ణం అవుతుంది.

నీరు:

simple solutions for indigestion problemనీటిని అధికంగా తాగడం వల్ల అసిడిటీ సమస్య నుంచి బయటపడొచ్చు. అప్పటి వరకు జీర్ణం కాకుండా ఉన్న పదార్ధాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి.

సోంపు:

simple solutions for indigestion problemఅజీర్ణం సమస్యకు సోంపు గింజలు మంచి పరిష్కారాన్ని ఇస్తాయి. 1 టీస్పూన్ సోంపును భోజనం తర్వాత తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.

పెరుగు:

simple solutions for indigestion problemఅజీర్ణానికి మంచి ఉపశమనాన్ని ఇచ్చేది పెరుగు. కీర దోస ముక్కలు, కొత్తిమీరను పెరుగులో వేయాలి, ఈ మూడింటినీ భోజనం తర్వాత తాగితే అసలు ఎలాంటి అజీర్ణ సమస్యలైనా ఇట్టే తగ్గిపోతాయి.