Sita Ramam cinema chusina vallaki letter anagane already strike aipoyi untundi ee article lo em undabotundi anedi. Dayachesi Sita Ramam chudani varu unte ee letters chadavoddu anedi ma humble request because meeku idi pedda spoiler and aa feel miss avtharu.
If already chusina vallu aithe oddu anna malli malli chaduvutharu adi naaku telustundi. Meeru already intro skip chesi letters ki vellipoyaru ani kuda telusu…letters anni chadivaka malli intro chadavadaniki occharu ani kuda telusu…naku kanapdtundi.
Sare Inka Selavu Mari…ee uttaralu chadukondi.
1. మొదటి ఉత్తరం
Dear Ram
మీకు ఎవరు లేరా? ఈ అబద్దాలు ఎక్కడ నేర్చుకుంటున్నావేం కొత్తగా? ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని బొత్తిగా మర్చిపోయినట్లున్నావ్? ఇదిగో వస్తానని వెళ్ళావ్ ఉద్యోగానికి నన్ను మా పుట్టింట్లో వదిలేసి. ఇంట్లో వాళ్ళు అప్పటికే చెప్తూనే ఉన్నారు ఈ మిలిటరీ వాడు ఇంటి పట్టున ఉండడే అని… వింటేగా !
కట్టుకున్నాక తప్పుతుందా….నా మీద బెంగతో ఉండకే…!
ఇట్లు నీ సీత మహాలక్ష్మి
2. రెండవ ఉత్తరం
Dear Ram
ఏమయ్యా రామయ్య…ఎలా ఉన్నావ్? నీకేం బాగానే ఉండి ఉంటావ్? ఇక్కడ గదిలో చలి పెరుగుతుంది…కాశ్మీరు నుంచి నువ్వే పంపుతున్నావా? నిన్నంతా ఒకటే వర్షం…ఈ రుతువులు కూడా నీలాగే వచ్చి నాతో ఉండకుండా వెళ్లిపోతున్నాయి. మళ్ళీ ఎప్పుడొస్తావ్ రామ్? నిన్నే గుర్తు చేసుకుంటూ…
ఇట్లు నీ భార్య సీత మహాలక్ష్మి
3. మూడో ఉత్తరం
Oye రామ్
నీకో విషయం తెలుసా? నాతో పాటే మన ఇంటి వెనక పెరడు కూడా మీ మీద బెంగ పెట్టుకుంది? పూలు పూయడమే మానేసాయి…ఆ వంకతో సీతాకోక చిలుకలు రావడం మానేసాయి. ఈ సారి ఇంటికొచ్చే అప్పుడు నాకోసం వాటిని తెస్తారా?
4. నాలుగో ఉత్తరం
Dear రామ్
నిన్న మన పక్కింటి ఆవిడా… మనం మొదటి సారి ఎలా కలిసాం అని అడిగింది?
” కురుక్షేత్రంలో రావణ సంహారం…..యుద్దపు వెలుగులో సీత స్వయంవరం ”
అని చెబితే ఎదో అర్ధమయినట్టు నవ్వి వెళ్ళిపోయింది… దానర్థమేంటో నువ్వు తప్ప ఎవ్వరు చెప్పలేరు
ఇంకో విషయం నిన్న రాత్రి ఓ కల వచ్చింది…
కలలో నీకు అరవై ఏళ్లు నా చుట్టూనే తిరుగుతున్నావ్…
ఎం కావాలన్నా సీత….సీత అని పిలుస్తున్నావ్
అంతలో తెల్లారింది…పక్కన చూస్తే నువ్వు లేవు…
ఇట్లు నీ భార్య సీత మహాలక్ష్మి
5. ఐదవ ఉత్తరం
ప్రియమైన Ram కి
ఈ నెల పన్నెండవ తారీఖున… హైదరాబాద్ వెళ్తున్నాను. బట్టలు సర్దుతుంటే అందులో మన పెళ్లి బట్టలు కనపడ్డాయి… ఆ బట్టలో మీరు పడిన సిగ్గు ఇంకా నా కళ్ళెదుటే కనబడుతుంది. నలబై ఎనిమిది గంటల Journey ఒంటరిగా అంత దూరం ఎప్పుడు ప్రయాణించలేదు…కానీ నేను manage చేసుకుంటాలే ఎంతైనా lieutenant Wife ని కదా.
హైదరాబాద్లో ఇదే నెల Austin మేజిక్ షో ఉంది…ఉంటే దగ్గరుండి తీసుకెళ్లేవాడివి !
ఇట్లు నీ భార్య సీత మహాలక్ష్మి