Home Health వడదెబ్బ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన లక్షణాలు, జాగ్రత్తలు

వడదెబ్బ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన లక్షణాలు, జాగ్రత్తలు

0

చూస్తూ ఉండగానే వేసవి వచ్చేసింది. సమ్మర్ హీటెక్కిస్తోంది. వేడి గాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎండ వేడిమికి జనాలు అల్లాడుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు ఉక్కపోత చికాకు తెప్పిస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈసారి ఎండలు దంచి కొడుతుండటంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో మంచినీరే దివ్య ఔషధమని చెబుతున్నారు. ఎండ వేడిమితో శరీరం నుంచి చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంటుంది. వడదెబ్బ తగలడానికి అవకాశం ఎక్కువగా ఉంది.

Causes of Sunstrokeసాధారణంగా మానవ శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ ఉంటుంది.అంతకంటే ఉష్ణో గ్రత కొంచెం పెరిగితే జ్వరం వచ్చినట్లు చెబుతారు. ఉష్ణో గ్రతలు 104, 106 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ పెరిగితే సన్‌ స్ట్రో క్‌ (వడదెబ్బ) తగిలినట్లు లెక్క.వేసవిలో ప్రధానంగా దీని బారిన పడేవాళ్లు చాలామంది ఉంటారు. వేసవిలో సూర్యుడి తాపం రోజు రోజుకూ పెరుగుతూ ఉంటుంది. ఉష్ణోగ్రతలను నిర్లక్ష్యం చేస్తూ ఎక్కు వగా ఎండలో తిరిగితే వడదెబ్బకు గురవుతారు.

ఎక్కు వగా ఎండలో తిరగడం వల్ల హృదయ స్పందనలో కలిగే మార్పుల కారణంగా మెదడులోని భాగం సమతుల్యతను కోల్పోతుంది. ఫలితంగా అదుపు చేసే శక్తి లేకపోవటంతో సన్‌ స్ట్రో క్‌ తగిలి ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి. దాదాపు 30 నుండి 40 శాతం మేర వడదెబ్బ మరణాలు చోటుచేసుకుంటాయి.

శరీరం నుంచి చెమట రావడం నిలిచిపోతుంది. నాడి వేగంగా కొట్టుకుంటుంది. శరీరం, మెదడుస్వాధీనంలో ఉండవు. సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మిగతా అన్ని జబ్బులను నయం చేసుకోడానికి కొంత వ్యవధి ఉంటుంది. కానీ వడదెబ్బ విషయంలో ప్రాణాపాయం జరగడమన్నది ఒక్కోసారి కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలలో జరిగిపోవచ్చు. చర్మం పొడిబారిపోవడం అన్నది కేవలం చర్మ సంబంధ సమస్య కాదు. శరీరంలో నీటి పరిమాణం పడిపోయిందని చెప్పే ఒక సూచన.వడదెబ్బ నుంచి కాస్త కోలుకున్నామని అనిపించిన వెంటనే మళ్లీ ఎండలోకి వెళ్లొద్దు.

సాధారణంగా ఐదేళ్ల లోపు, 60 సంవత్సరాలు పైబడిన వారు త్వరగా ఎండదెబ్బకు గురవుతారు.ఒక్కో సారి ఇది ఆకస్మిక మరణాలకు దారితీస్తుంది. అదే విధంగా గర్భిణీలు,బాలింతలు శరీరంలోని తేమ శాతాన్ని కాపాడుకుంటూ ఉండాలి. క్రీడాకారులు, స్థూలకాయులు,దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నవారు, ఆరు బయట వ్యాయామం. పోలీసు వంటి వృత్తుల్లో ఉన్న వాళ్లు శరీరం డీ హైడ్రేట్‍ కాకుండా చూసుకోవాలి. మద్యం తీసుకునేవాళ్లు,మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవాళ్లు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి.కొన్ని మందులు వాడే వారు. పొడి చర్మం, వేడి చర్మం ఉన్న వాళ్లు, స్వేద రంధ్రాలు తక్కు వగా ఉండే వాళ్లకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కు వగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వీరంతా ఎండకు బయటకు వెళ్లకపోవడమే మంచిది.

వడదెబ్బ ప్రభావం ముందుగా శరీరంపై పడుతుంది. అధికంగా ఎండలో తిరగటంతో శరీరం మీది రక్త కణాలు కుంచించుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, లివర్‌‌ దెబ్బతినడానికి దారి తీస్తుంది. శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి చిన్నపాటి జాగ్రత్తలతో వడదెబ్బను అధిగమించవచ్చు.

వడదెబ్బ తగిలిన రోజంతా విశ్రాంతి తీసుకుంటేనే శరీర వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. ఈ లక్షణాలు కనబడితే వెంటనే వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తరలించాలి. శరీరాన్ని చల్లటి నీళ్లతో లేదా ఐస్ తో తుడవాలి.వెంటనే డాక్టర్‍ దగ్గరకు తీసుకెళ్లాలి.వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు క్యాప్‍ పెట్టుకోవాలి. తరచూ నీళ్లు తాగుతుండాలి. కళ్లకు కూలింగ్‍ గ్లాసెస్‍ పెట్టుకోవాలి. అలాగే బయటకి వెళ్లేటప్పుడు వాటర్‍ బాటిల్‍ ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి.

 

Exit mobile version