Home Health పెరుగు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

పెరుగు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0

వేసవి రానే వచ్చింది. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వడగాలుల సమస్య కూడా రాబోతుంది. మరి ఇలాంటి సమయంలో మన ఆరోగ్యాన్ని ‘కవచం’లా కాపాడే ‘పెరుగు’ను వరంగా భావించవచ్చు. ఇప్పటివరకు పెరుగును దూరంగా పెట్టినవాళ్లు దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండ ఉండరేమో. పెరుగు వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. మెదడు చురుగ్గా పనిచేయడంలోనూ పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేసవికాలంలో పెరుగు, మజ్జిగ తీసుకుంటే శరీరం వేసవి తాపానికి గురికాకుండా ఉంటుంది. ఆహార నియమాల్లో పెరుగు, మజ్జిగకు ప్రత్యేక స్థానం కల్పిస్తే ఇక మంచి ఆరోగ్యం మీ సొంతం.

health benefits of Curdజలుబు ఉంటే పెరుగు తినకూడదు అంటారు.. కానీ జలుబుకు పెరుగు విరుగుడు.

పెరుగు ఎలాంటి వాతవ్యాధినైనా జయిస్తుంది. బరువును తగ్గిస్తుంది, శరీరపుష్టిని కలిగిస్తుంది. జీలకర్ర పొడిని ఓ కప్పు పెరుగులో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతుంది.

మూత్ర సంబంధ రోగాలకు, జిగురు విరేచనాలకు పెరుగు ఉత్తమ నియంత్రణ.

జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండేవాళ్ళకు పెరుగు అమృతం వంటిది. భోజనం తరువాత పెరుగు తింటే జీర్ణ సమస్యలు ధరి చేరవు.

పెరుగు రెగ్యులర్ గా తీసుకుంటే ఎపెండిసైటిస్ రాదు.

కామెర్లు వచ్చిన వారికి పెరుగు ఒక చక్కని ఔషధం. కామెర్లు వచ్చిన వారికి పెరుగు, మజ్జిగ అధిక మొత్తంలో ఆహారంగా ఇస్తూ దాంట్లో కొద్దిగా తేనె కూడా కలిపి ఇస్తే మరింతగా త్వరగా కోలుకొనే అవకాశం ఉంది.

కడుపులో అల్సర్ ఉండే వారిలో, గ్యాస్ట్రిక్ ఇరిటెషన్ తో బాధపడేవారికి, హైపర్ ఎసిడిటీతో బాధపడేవారికి పెరుగు అత్యద్భుతమైన ఫలితాన్నిస్తుంది.

మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజూ పెరుగుని, మజ్జిగను వాడటం మంచిది.

నిద్రపట్టని వారికి పెరుగు ఒక వరం. ఆయుర్వేదంలో గేదె పెరుగు నిద్ర పట్టని వారికి వాడమని చెబుతారు.

చర్మవ్యాధులు, చర్మ కాంతులకు పెరుగు, మజ్జిగ అమోఘంగా పనిచేస్తుందని అంటారు.

మీకు పెరుగులో పంచదార కలుపుకుని తినడం ఇష్టమైతే.. రాత్రిపూట ఈ ఫ్లేవర్ ట్రై చేయవచ్చు. రాత్రి భోజనం తర్వాత ఒక కప్పు పెరుగు, కాస్త పంచదార తీసుకుంటే.. పొట్టలో చల్లదనంతోపాటు, పోషకాలన్నీ పొందవచ్చు.

 

Exit mobile version