Home Unknown facts శివుడు మూలస్థానేశ్వరుడిగా దర్శనం ఇచ్చే ఆలయం ఎక్కడ ఉంది?

శివుడు మూలస్థానేశ్వరుడిగా దర్శనం ఇచ్చే ఆలయం ఎక్కడ ఉంది?

0

శివుడు మూలస్థానేశ్వరుడిగా దర్శనం ఇచ్చే ఈ ఆలయం దేశంలోని అతి ప్రాచీన ఆలయాలలో ఒకటిగా చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మూలస్థానేశ్వరుడిఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా నుండి 30 కి.మీ. దూరంలో అమ్మాపురం నుండి 3 కి.మీ. దూరంలో నాదెండ్ల గ్రామంలో శ్రీ మూలస్థానేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఈ స్వామివారు స్వయంభువుగా వెలసినట్లు తెలియుచున్నది. ద్వాపర యుగాంతమున ఈ మూలస్థానేశ్వరస్వామి వారితో పాటు లలితా త్రిపుర సుందరీదేవి, మార్కండేయ మహర్షిని ఇక్కడ ప్రతిష్టించినట్లు చెబుతారు.

ప్రధాన ఆలయ ముంగిట స్తూపాకృతిలో పంచకలశయుక్తంగా, నాలుగు అంతస్థులతో రాజగోపురం గోపురంపై శివలీలా విశేషాలకు సంబంధించిన విగ్రహాలతో పాటు పలు శక్తిస్వరూపాలు కుడి ఉన్నాయి. వర్ణరంజితమైన నటరాజ విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయ ముఖ మంటపంపైన శివపార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంబం, నందీశ్వరుడు కొలువై ఉన్నారు. ఆలయ లోగిలిలో గల నాగశిలపై ఉన్న భారీ శిలాశాసనం ఈ క్షేత్ర వైభవాన్ని గూర్చి సమగ్రంగా వివరిస్తుంది.

గర్భాలయంలో కైలాసమంటపంలో పానవట్టంపై స్వామి లింగాకారంలో మూలస్థానేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. స్వామికి అభిముఖంగా నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే సర్వాలంకారభూషితమై, చతుర్భుజాలతో శ్రీ లలితాదేవి దర్శనమిస్తుంది. అమ్మవారి పాదపీఠ సమక్షంలో శ్రీచక్రం ఉంది.

ఈ ఆలయంలో నిత్యపూజలతో పాటు ప్రతి సోమవారం రుద్రాభిషేకం జరుగుతుంది. ఇక మహాశివరాత్రి, వైశాఖమాసం, శ్రావణమాసం, కార్తీకమాసాలలో పూజాది కార్యక్రమాలను, రధోత్సవాలు, కల్యాణ మహోత్సవాలు అతి వైభవంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు.

Exit mobile version