Home Health షుగర్ ఉన్నవాళ్లు వేసవిలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు!

షుగర్ ఉన్నవాళ్లు వేసవిలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు!

0

ఈ ఉరుకుల పరుగుల గజిబిజి ప్రపంచంలో రోజు రోజుకీ డయాబెటిస్ పేషేంట్స్ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. నివారణ మాత్రమే మార్గం. అందుకే షుగర్ బారినపడిన వారు తినే ఆహారం దగ్గర నుంచి నిద్ర, శారీరక శ్రమ, అన్నింటిపై దృష్టి పెట్టాలని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

Sugar Patients Foods to take in the summerముఖ్యంగా వేసవిలో చల్లని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే వేసవిలో మధుమేహవ్యాధి గ్రస్తులు ఏం తినాలి అనే విషయంలో చాల సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే తెలియకుండా తినే ఆహారంతో షుగర్ లెవెల్ హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి.

అలాంటి షుగ‌ర్ పేషెంట్స్ కూడా నిర‌భ్యంతరంగా తిన‌గ‌లిగే కొన్ని ర‌కాల‌ స్నాక్స్ ఉన్నాయి. ఈ స‌మ్మ‌ర్‌లో వీటిని ట్రై చేయ‌డం వ‌ల్ల నోటికి రుచి దొరుకుతుంది. అలాగే శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

1. పెస‌ర‌ప‌ప్పు:

పెస‌ర‌ప‌ప్పులో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి డ‌యాబెటిస్‌ను నియంత్రించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. త‌ర‌చూ కూర‌ల‌కు వాడే ఈ ప‌ప్పుతో పెస‌రట్టు గాని మరేదైనా స్నాక్ లాగా చేసుకొని తినేయొచ్చు.

2. మొల‌క‌లు:

మొల‌క‌లు తేలికైన ఆహారం. వీటిలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది గ్లెసెమిక్ స్థాయుల‌ను స‌మ‌తుల్యం చేస్తుంది. దీనివల్ల డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. కానీ ఖాళీ మొల‌క‌లు తిన‌డానికి చాలామంది ఇష్ట‌ప‌డ‌రు.

అలాంట‌ప్పుడు ఈ మొల‌క‌ల‌కు దోస‌కాయ‌, ట‌మాటా, ఉల్లిగ‌డ్డ‌, క్యాప్సికం ముక్క‌ల‌ను యాడ్ చేసి స‌లాడ్‌గా ట్రై చేయొచ్చు. అదే ఈ వేసవి కాలంలో కాస్త చ‌ల్ల‌ద‌నం కూడా కావాల‌నుకుంటే ఈ మొల‌క‌ల స‌లాడ్‌కు పెరుగును కూడా క‌లిపి తీసుకోవ‌చ్చు.

3. ఫ్రూట్ పెప్సికల్స్:

రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచడానికి మార్కెట్ లో లభించే ఫ్రూట్ పెప్సికల్స్ (ఐస్ క్యాండిల్స్) కి బదులు వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బెర్రీలు, నారింజ, కివీస్, లిట్చిస్ వంటి కొన్ని తాజా పండ్లను తీసుకొని వాటిని ఐస్ ట్రేలో వేసి, కొంచెం నీరు లేదా ఏదైనా షుగర్ లెని పండ్ల రసం పైన పోయాలి. తర్వాత దానిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక రోజు తర్వాత తినవచ్చు.

4. ఎగ్ చాట్‌:

మ‌ధుమేహ గ్ర‌స్తులు ఉడ‌క‌బెట్టిన గుడ్ల‌తో కూడా చాట్ చేసుకుని రుచిగా తినొచ్చు. ఇందుకోసం ముందుగా కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టిన త‌ర్వాత వాటిని ముక్క‌లుగా చేసుకోవాలి. ఆ త‌ర్వాత ఒక పాన్‌లో నూనె పోసి కోడిముక్క‌ల‌ను ఫ్రై చేయ‌డంతో పాటు, కారం, మసాలా, ఉప్పు, కొత్తిమీర వేసి చాట్ చేసుకుని సాయంకాలం స‌ర‌దాగా తినొచ్చు.

5. దోస‌కాయ ముక్క‌లు:

స‌మ్మ‌ర్‌లో దోస‌కాయ‌లు శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్ని ఇస్తాయి. పైగా వీటిలో కార్బొహైడ్రేట్లు, కేల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. న్యూట్రిషియ‌న్లు అధికంగా ఉంటాయి. కాబ‌ట్టి షుగ‌ర్ పేషెంట్స్ వీటిని నిర‌భ్యంతరంగా తినేయొచ్చు.

 

Exit mobile version