Home Health మధుమేహం ప్రమాదం నుంచి తప్పించుకుకోవాలంటే ఇవి తప్పక పాటించండి

మధుమేహం ప్రమాదం నుంచి తప్పించుకుకోవాలంటే ఇవి తప్పక పాటించండి

0

శరీనంలో షుగర్‌స్థాయి అధికంగా ఉంటే రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుందని, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మధుమేహ బాధితులు తమ వ్యాధిని నియంత్రణ చేసుకుంటూ.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతకు ముందు షుగర్‌ వ్యాధి లేకున్నా కరోనా చికిత్స పొందినవారిలో స్టెరాయిడ్స్‌, ఇతర మందుల ప్రభావం వల్ల షుగర్‌ లక్షణాలు బయటపడుతున్నాయని వివరించారు.

Coronaడయాబెటిస్.. చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. దీన్నే మధుమేహం, షుగర్, చక్కెర వ్యాధి అని పిలుస్తారు. డాక్టర్లు సూచించిన మందులతో పాటు సరైన ఆహార పద్దుతులను పాటిస్తే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. రక్తంలోని చక్కర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు అధిక రక్త పీడనం వంటి సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు.

షుగర్ వ్యాధి అంటే చాలా మంది భయపడుతుంటారు. ఈ సమస్య కారణంగా తెగ ఇబ్బందిపడుతుంటారు. ఈ వ్యాధిపై అనేక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు సరికొత్త విషయం తెలిపారు. అదే పచ్చిమిర్చి.. అవును మిర్చిని ఎక్కువగా తినడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుందట.

మధుమేహ వ్యాధిగ్రస్తులు చేపలు తింటే చాలా మంచిది. హెర్రింగ్, సార్డైన్, సాల్మన్, అల్బకోర్ ట్యూనా, మాకేరాల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకే వారంలో కనీసం రెండు సార్లు అయిన చేపలను తినటానికి ప్రయత్నించండి.

ఇక డయాబెటిస్‌ అందుపులో ఉండేందుకు వేరుశనగ ఎంతగానో ఉపయోగపడుతుంది. డయాబెటిస్‌ టైప్‌ 2 ఉన్నవారు వేరు శనగ తినడం వల్ల షుగర్ ని అదుపులో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇందులో మాంగనీస్‌, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వు మరియు కార్బోహైడ్రేట్‌ల విషయంలో ముఖ్య పాత్ర పోషించి మెటబాలింకు సహాయపడాతాయి. క్యాల్షియం గ్రహించడం మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి.

రెగ్యులర్ గా గ్రీన్ టీ త్రాగేవారికి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు తక్కువ గ్రీన్ టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిస్ రాకుండా నివారిస్తుంది. గ్రీన్ టీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయం చేస్తుంది . టీలో ఉండే పాలీఫెనాల్స్‌ మెటాబాలిజంను ప్రేరేపిస్తుంది. గ్రీన్‌ టీ తక్కువ ప్రాసెస్‌ అయి ఉండడమే కాక అందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది.

మీరు తీసుకొనే ఆహారంలో దాల్చిన చెక్క పొడిను తీసుకోవడం మంచిది. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. గోరువెచ్చని నీటితో చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధికి గుడ్ బై చెప్పవచ్చు.

మధుమేహం ఉన్నవారు ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి. ఈ ఒత్తిడి ఏదో ఒక రోజు కాకుండా, రోజూ ఎదుర్కుంటూ ఉంటే హార్మోన్ల పనితీరు మందగించి, ఒకవేళ ఇన్సులిన్ సరిగ్గాఉత్పత్తి అయినా ఆ మోతాదు శరీరానికి సరిపోదు. ఫలితంగా డయాబెటిస్ వస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళను అధికంగా ఉన్నవారు వాటిని పూర్తిగా తగ్గించుకోవాలి

నువ్వులు డయాబెటిస్ రోగులకు చాలా మేలు చేస్తాయి. నువ్వులు మంచి మొత్తంలో ప్రోటీన్ మరియు ఫైబర్ కలిగివుంటాయి. కాబట్టి ఇది డయాబెటిస్ రోగులలో రక్తంలో చక్కెర పెరగడానికి అనుమతించదు. 100 గ్రాముల నువ్వులు 12 గ్రాముల ఫైబర్ కలిగి ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తినడం ద్వారా గ్లూకోజ్ చక్కెరలో నెమ్మదిగా కరిగిపోతుంది. తద్వారా చక్కెర పెరిగే ప్రమాదం తగ్గుతుంది. ఇది కాకుండా 18 గ్రాముల ప్రోటీన్ కూడా ఇందులో ఉంది.

ఎక్కువగా మనం రాత్రివేళ ఆలస్యంగా తిని అలాగే నిద్రిస్తున్నాం. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉందట. కాబట్టి రోజూ రాత్రిపూట తిన్న తర్వాత ఓ పది నిమిషాలు సరదాగా అలా నడిస్తే బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గి మధుమేహం ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతి రోజూ వ్యాయామం చేయడం ద్వారా రక్తప్రసరణను మెరుగుపరచి, రక్తంలోని షుగర్ లెవల్స్ ను క్లియర్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల జీవక్రియ క్రమంగా పనిచేసి, షుగర్ రాకుండా సహాయపడుతుంది.

Exit mobile version