Home Health బ్లాక్ ఫంగస్ ఎటాక్ అయిన వారిలో కనిపించే లక్షణాలు

బ్లాక్ ఫంగస్ ఎటాక్ అయిన వారిలో కనిపించే లక్షణాలు

0

దేశంలో ఇప్పటికే కరోనా కల్లోలం రేపుతుంటే ఇప్పుడు, మరో ప్రాణాంతక వ్యాధి బ్లాక్ ఫంగస్ పడగవిప్పుతోంది. కరోనా మహమ్మారి బారిన పడిన వారిలో బ్లాక్‌ ఫంగస్‌ ఏర్పడి ప్రాణాలను తీస్తోంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కొత్తగా భయపెడుతున్న బ్లాక్ ఫంగస్ వైరస్ కానే కాదు. కొవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల తలెత్తే మ్యూకర్మైకోసిస్ వ్యాధినే బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు. అవసరంలేకున్నా స్టెరాయిడ్లు ఉపయోగిస్తుండటం.. బ్లాక్ ఫంగస్ ఉద్ధృతికి కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. దీని బారినపడితే కళ్లు ఎర్రబారి చూపుకోల్పోవడంతోపాటు అవయవాలు పనిచేయడం మానేసి మృత్యువాతపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Symptoms of Black Fungus Attackఇది చాలా అరుదైన ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. దాదాపు పది లక్షల మందిలో ఒకరికి సోకుతుంది. కానీ ఇప్పుడు వైరస్ సోకిన చాలామందిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ ఇన్ఫెక్షన్‌ ముక్కు నుంచి ప్రారంభమై కళ్లకు వ్యాపిస్తుంది. కంటి చుట్టూ ఉండే కండరాలను స్తంభింపజేసి.. అంధత్వానికి దారితీస్తుంది. ఇన్ఫెక్షన్‌ మెదడుకు పాకితే మెనింజైటి్‌స(మజ్జ రోగం)కు దారితీస్తుందని నిపుణులు పేర్కొంటారు. ప్రారంభదశలోనే బ్లాక్ ఫంగస్ ను గుర్తించకుంటే ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఎందుకంటే దీని డెత్ రేటు 50 శాతం. అంటే, బ్లాక్ ఫంగస్ సోకితే ప్రతి ఇద్దరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయే అవకాశముంది.

ఇది డయాబెటిక్‌ రోగులకు ప్రాణాంతకంగా మారుతోంది. ముఖ్యంగా సైనస్, బ్రెయిన్‌ లేదా కాలేయంపై ప్రభావం చూపుతుందట. ఈ ఫంగస్‌ బ్రెయిన్‌తో పాటు ఇతర శరీర భాగాలకు చర్మం, పన్ను, ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తుందని డాక్టర్లు తెలిపారు. బ్లాక్ ఫంగస్ అటాక్ అయిన వారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తున్నాయి.

>సైనాసైటీస్‌..ముక్కు ద్వారాలు మూసుకుపోవడం.

>దవడ భాగంలో నొప్పి, ఒకవైపు ముఖం నొప్పి, తిమ్మిర్లు, వాపు

>ముక్కుపై నలుపు రావడం

>కళ్లు నొప్పి అయి, బ్లర్‌గా కనిపించడం

>ఛాతినొప్పి, జీర్ణాశయం పై కూడా దీన్ని ప్రభావం ఉంటుంది.

> కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు,

>శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నొప్పులు, నెత్తుటి వాంతులు, చురుకుదనంలో మార్పులు చోటుచేసుకోవడం.

బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న కొవిడ్ రోగులకు బ్లాక్ ఫంగస్ సంక్రమించే అవకాశాలు ఎక్కువ. ఈ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ పెరుగుతున్న నేపథ్యంలో డయాబెటీస్‌ రోగులు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు వైద్యులు తెలుపుతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు షుగర్‌ లెవల్‌ చెక్‌ చేసుకోవడం మంచిది. కొవిడ్‌ భారిన పడిన వారిలో కొన్ని స్టెరాయిడ్స్‌ తీసుకోవడం వల్ల లంగ్స్‌లో మంటగా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కొన్ని సమస్యలు కూడా ఏర్ప డతాయి. ఇమ్యూనిటీ సిస్టం దెబ్బ తింటుంది. షుగర్‌ లెవల్‌ కూడా పెరుగుతుంది.

ఇది షుగర్‌ లేని వారిలో కూడా కనిపిస్తోంది. దీనికి పవర్‌ఫుల్‌ చికిత్స అవసరమవుతుంది. లేకపోతే ఇతర అవయవాలపై కేన్సర్, కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతుంది. రోగాన్ని ముందే గుర్తించి నయం చేసుకోవడమే మేలు కొవిడ్‌ తగ్గిన తర్వాత సరైన స్టెరాయిడ్స్‌ తగిన సమయంలో తీసుకుని ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేసుకున్నవారు గ్లూకోజ్‌ పరిమాణం ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

కరోనా వచ్చిన వారు పోషక ఆహారం తీసుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్లు కూడా వైద్యుల సలహా మేరకు వారి ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉండగా దేశంలో కరోనా వైరస్ ని అరికట్టడానికి పలు రాష్ట్రాలలో లాక్ డౌన్, కర్ఫ్యూని విధించారు. మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని, అయినా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అధికారులు చెప్పారు.

 

Exit mobile version