Home Unknown facts రాత్రి సమయంలో ఇక్కడకి మనుషులే కాదు, కనీసం పక్షులు కూడా వెళ్లవు ఎందుకు ?

రాత్రి సమయంలో ఇక్కడకి మనుషులే కాదు, కనీసం పక్షులు కూడా వెళ్లవు ఎందుకు ?

0

మన దేశంలో ఉండే కొన్ని ఆలయాలలో జరిగే ఆశ్చర్యకర సంఘటనలను, అక్కడి వింతలను ఛేదించడానికి చాలా మంది వారి జీవితం కాలం అంత ప్రయత్నించినప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. అలాంటి మిస్టరీలలో ఒకటి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కృష్ణుడి రహస్యం ప్రదేశం. అయితే ఇక్కడికి రాత్రి పూట అసలు ప్రవేశం లేదు, అలా రాత్రి సమయంలో వెళ్లాలని కూడా ఎవరు సాహసించరు. మరి ఈ రహస్య ప్రదేశంలో ఏం ఉంది? అక్కడ రాత్రి సమయం లో ఏం జరుగుతుంది?  రాత్రి సమయంలో ఎందుకు అనుమతి లేదనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

mysterious place of lord krishna

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మధుర జిల్లాలోని బృందావనంలో నిధివాన్ అనే ఆలయం ఉంది.  అయితే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాదని కలవడానికి ఈ ప్రదేశానికి వచ్చేవాడని చెబుతారు. అయితే గోపికలు శ్రీకృష్ణుడితో అచ్చికలాడిన ప్రదేశం నిధివనం. ఇప్పటికి  ప్రతి రాత్రీ గోపికలు కృష్ణుడితో నాట్యమాడుతారని చెబుతుంటారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత నిధివనంలోకి ఎవరినీ అనుమతించరు. అంతేకాకుండా తెల్లారేసరికి గోపికలు చెట్లుగా మారిపోతారని అంటారు. ఈ వనంలోని చెట్ల కొమ్మలు పైకి పెరగకుండా వయ్యారాలు ఒలకబోస్తూ వంకర్లు తిరిగి కిందికి పెరగడం ఒక విశేషం. అయితే గోపికలతో ఆడి అలసిన కృష్ణుడు అదే వనంలోని రంగ్‌ మహల్‌లో రాధమ్మ ఒడిలో పడుకొని బడలిక తీర్చుకుంటాడని కొందరి నమ్మకం.

ఇది ఇలా ఉంటె, స్థల పురాణం ప్రకారం, రాధకృష్ణలు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం చేసే సమయంలో కృష్ణుడి భటులు రాత్రి పూట ఈ నిధివన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపాలా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని పురాణం. అందువల్లే నిధివన్ లోని ప్రధాన ఆలయం ద్వారాలను సూర్యాస్తమయం అయిన వెంటనే మూసివేస్తారు. అంతేకాకుండా నిధివన్ కు ప్రవేశించే ద్వారాన్ని కూడా మూసి తాళం వేస్తారు. రాత్రి సమయంలో ఇక్కడకు మనుషులే కాదు, కనీసం పక్షులు కూడా వెళ్లవు.

ఇందుకు నిదర్శనంగా ఉదయం వందల సంఖ్యలో కోతులు ఉండే నిధివన్ లో రాత్రి అయిన వెంటనే ఒక్క కోతి కూడా ఆ ప్రాంతంలో కనిపించదు. అదేవిధంగా అనేక చెట్ల పైన ఉదయం పూట కనిపించే పక్షులు కూడా రాత్రి సమయంలో అక్కడ ఉండవు. ఒక వేళ కట్టుబాటులను ధిక్కరించి ఈ నాట్యాన్ని చూసిన వారు చనిపోతారని లేదా మతిస్థిమితం కోల్పోతారని చాలా ఏళ్లుగా నమ్ముతున్నారు. అంతేకాకాండా ఆ వనానికి ఎదురుగా వాకిళ్లు వచ్చేలా ఇంటి నిర్మాణం కూడా చేపట్టరు. ఇక రాత్రి సమయంలో ఆ వనానికి దగ్గరగా ఉన్న ఇళ్లలోని వారు వనం వైపు ఉన్న కిటికీలను కూడా మూసివేస్తారు.

ఇక రాత్రి సమయంలో వేణు నాదం అంటే పిల్లనిగోవి వాయుస్తున్న శబ్ధంతో పాటు ఆడవారి పట్టీల శబ్దాలు వేల ఏళ్ల నుంచి వినిపిస్తున్నాయని చెబుతారు. కృష్ణుడి వేణుగానంతో పాటు గోపికలు నృత్యం చేయడం వల్ల ఆ శబ్దాలు వస్తుంటాయని అక్కడి స్థానికుల నమ్మకం.

ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే, నిధివన్ లో ఉన్న మొక్కల కాండాలు అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇక భూమి పై ఒక్క చుక్క నీరు లేకపోయినా చెట్లు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. ఈ చెట్లే రాత్రి పూట గోపికలుగా మారి నాట్యం చేస్తుంటారని చెబుతారు. వనం మధ్యలో ఉన్న రంగమహల్ లోనే రాధ, కృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతున్నారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాను నిండా పాలు, కొన్ని తీపి పదార్థాలు, తాంబూలం, పళ్లు తోముకోవడానికి రెండు వేపపుళ్లలు, చీర, గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తులు అక్కడ ఉంచుతారు.

ఇలా ఇక ఉదయం ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూళం నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లు ఉంటాయి. ఇక స్వీట్లు, పండ్లు సగం తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. దీన్ని భక్తులు కూడా చూస్తారు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతు. ఇటీవల ఓ ఛానల్ వారు ఈ రహస్యం కనుగొనాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఆలయ తాళాలు వేసి ఉన్నవి వేసినట్లే ఉన్నా ఉదయానికి రంగమహల్ లో మంచం పై దుప్పట్లు చెదిరి పోయి ఉండగా వెండి గ్లాసులు పాలు సంగం ఖాళీ అయ్యి కనిపించాయి. ఇక్కడ వనంలో ఉన్న కొలనును విశాఖ కుండ్ అని అంటారు. విశాఖ అనే గోపిక దప్పిక తీర్చడానికి కృష్ణుడు తన పిల్లనగోవితో ఈ కొలనును సృష్టించారని చెబుతారు. నిధివన్ కు వెళ్లినవారు ప్రధాన ఆలయమైన రంగమహల్ లోని రాధకృష్ణుడి విగ్రహాలతో పాటు విశాఖ కుండ్ ను దర్శించుకుని వస్తారు.

బాలకృష్ణుడి చిలిపి చేష్టలు, గోపాల కృష్ణుడి మాయలు, రాధాకృష్ణుడి లీలలు, వీటన్నిటికీ చిరునామా బృందావనం. కన్నయ్య చల్లని చూపు కోసం ఏటా లక్షల మంది భక్తులు బృందావనానికీ, ఆ చెంతనే ఉన్న మథురాపురికీ వస్తూ ఉంటారు.

Exit mobile version