మెట్టెలు ధరించడం వెనుక కారణం ఏమిటో తెలుసా ?

0
2315

పెళ్ళైన ఆడవారిని లక్ష్మి దేవితో పోల్చుతారు. నిజానికి వారు ధరించే బొట్టు,పూలు, గాజులు, తాళి, మెట్టెలు అన్ని చూపుకు లక్ష్మి దేవిని చూసినట్టే అనిపిస్తుంది. స్త్రీ ధరించే ప్రతిదానికి వెనుక పరమార్ధం ఉంటుంది. అయితే మెట్టెలు ధరించడం వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం..

మెట్టెలువధువుకి వరుడు పెళ్లి రోజున కాలి రెండోవ వేలుకీ మెట్టలు తొడగడం మన ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం .స్త్రీ ఆభరణాలు అన్నీ సామాన్యంగా యోగ శాస్త్రంలోనీ నాడులుకి సంబందించి ఉన్నాయి. స్త్రీలు వారి చేతికి వేసుకొనే గాజులు, కాళీ మెట్టలు రెండు కూడా సంతానాబివృద్ధికి, సుఖ ప్రసవం అవడానికి అనుకూలించే నాడులను సున్నితంగా నొక్కుతు ఉంటాయి.

మెట్టెలుఅందువల్ల మన పూర్వికులు వధువుకి కాళ్ల మెట్టలు ఆపాదించారు. ఈ మెట్టలు వధువుకి వివాహిత అని చెప్పే మరో గుర్తు. వివాహతంతులో వధువు పాదాన్ని రోకలిపై ఉంచి వరుడు ఆమే కాలి వేలుకి తోడుగుతారు. వీటిని ఒక్కక్క ప్రాంతంలొ ఓక్కలా తొడుగుతారు. కొన్ని చోట్ల వదువు పుట్టింటి వాళ్ళు తొడిగితే మరి కొన్ని చోట్ల మెట్టినింటివారు పెడతారు.