Home Unknown facts రుద్రాక్షను ధరించడం వలన ఈశ్వరుని అనుగ్రహం పొందుతారా ?

రుద్రాక్షను ధరించడం వలన ఈశ్వరుని అనుగ్రహం పొందుతారా ?

0

రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రునికి ఏంతో ప్రీతికరమైనవి. రుద్రాక్షలు ధరించడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి.

Rudrakshaఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి. అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనైనవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులో నుంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

మెడ, చేతులు, చెవులకు, రుద్రాక్షలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా ఉంటారు. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెప్తున్నాయి.

రుద్రాక్ష అంటే రుద్ర+అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని (శివుడు) అక్షుల (కన్నుల) నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించువారేనని పురాణాల ద్వారా తెలియుచున్నది. ఇప్పటికీ వేదాంతులు, గురువులు, పూజారులు లాంటివారు వీటిని ధరిస్తారు. కొంతమంది వీటిని ధరించుట వీలుకాని నియమ నిబంధనలను పాటించనివారు పూజా గృహముల యందు ఉంచి పూజించుట చూస్తాం.

శాస్త్రీయంగా, రుద్రాక్షల్లో ఉండే విద్యుత్ అయస్కాంత తత్వం వల్ల దానికి అంత శక్తి ఉంటుంది. ఈ విద్యుదయస్కాంత శక్తి రుద్రాక్షల్లో వైబ్రేషన్లు కలిగిస్తుంది. దీన్ని హెన్రీ (వోల్ట్ సెకండ్స్/ యాంపియర్) అనే యూనిట్లలో కొలుస్తారు. ఈ తరంగాలు మెదడులో కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేసి శరీరాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. అందుకేనేమో చేత్తో ముట్టుకోకపోయినా కూడా రుద్రాక్షల వల్ల ఆరోగ్యం మెరుగుపడ్డవారున్నారు.

రుద్రాక్షలలో ఇరవై ఒక్క రకాలు ఉంటాయి. వీటిని ముఖ్యముగా ముఖముల సంఖ్యా పరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి ఇరవై ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ప్రశస్తమయినదిగా చెప్పబడినది. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని చెబుతారు.

 

Exit mobile version