ఇది కాశీ కాదు, గంగలో మునక లేదు, కానీ మోక్షానికి దారే!
రుద్రాభిషేకాలు, కోటి దీపోత్సావాలు, భస్మ హారతులు ఇవేవీ జరగలేదు!
ఇది జ్యోతిర్లింగం కాదు, ఆలయ శిల్పసౌందర్యం లేదు!
ఉన్నదంతా వాడు, వాడి భక్తుడు!
చేసిందంతా ఆత్మ నివేదన, అంటే తననే నైవేద్యంగా మార్చి ఇచ్చేయడం. The complete surrenderence.
కన్నప్ప మళ్ళీ చనిపోయాడు, ఈసారి ఈయన పేరు, శ్రీ కే. యెన్. కృష్ణ భట్
బదవిలింగం కథ!
500 సంవత్సరాలా క్రితం విజయనగర సామ్రాజ్యం
అక్రమ దాడులకి గురైంది. ఈ విధ్వంసం కారణంగా హంపిలో ఉన్న బదవిలింగ మహాదేవ ఆలయంలోని శివుడికి పూజలు జరగలేదు. ఈ ఆలయంలోని శివుడిని బదవిలింగం అని అంటారు.ఆ దాడుల్లో బదవిలింగం పై కప్పు ద్వంసం చెయ్యబడింది. కానీ బదవిలింగం మాత్రం చెక్కు చెదరలేదు పైగా దానివల్ల సూర్యకిరణాలు బదవిలింగంపై నేరుగా పడి శివలింగాన్ని తేజోవంతంగా చేస్తుంది.
కన్నడంలో బదవి అంటే పేద మహిళ అని అర్ధం బదవిలింగం అంటే పేద మహిళ యొక్క శివలింగం అని అర్థం. ఈ పేద మహిళని యే ఒక్కరు గుడి మెట్లు తొక్కాణించకపోవడంతో స్వయానా ఆమె డబ్బులు సేకరిచించి ఈ ఆలయాన్ని స్థాపించనట్టు చెబుతారు.
1980 నుంచి మళ్ళీ ఈ బదవలింగనికి పూజలు చెయ్యడం ప్రారంభించారు.
శివుడు ఎంచుకున్న భక్తుడు!
సాధారణంగా మన కాలు ఏదైనా చిన్న వస్తువుకి తాకితేనే తప్పుగా భావిస్తాం. అలాంటిది శివయ్యకి మన కాలు తాగితే, ఖచ్చితంగా పాపం అని భావిస్తాము కదా. కానీ శ్రీ కే. యెన్. కృష్ణ భట్ గారి విషయంలో మాత్రం ఇది చెల్లదు. ఎందుకంటే అయిన సుమారు 30 ఏళ్ల నుంచి ఆ 10 అడుగుల బదవిలింగాన్ని ఎటువంటి సాయం లేకుండా ఎక్కి స్వయనే ఆయనే అంత శుభ్రపరిచి అలంకిరించి విభూది రాసి శివయ్యకి తోడుగా నీడగా వున్నాడు కాబట్టి. ఈ చర్యని చూసిన ఏ ఒక్కరు తప్పుగా భావించారు ఎందుకంటే అయిన శివుడు ఎంచుకున్న మహా భక్తుడులా కనిపిస్తాడు కాబట్టి.
ఈ మహాపండితుడికి రెండు ఏళ్లకి లేదా ఆరు నెలలకి ఒకసారి మాత్రమే డబ్బులు చెల్లిస్తారు. 40 ఏళ్ల నుంచి ఒక్కరోజు కూడా శివ సేవకి అయిన దూరం కాలేదు.
శ్రీ కే. యెన్. కృష్ణ భట్ గారు ఈ మధ్యనే చనిపోయారు. అయిన చివరి శ్వాస వరకు శివుని సేవలోనే జీవించారు, ఇప్పుడు మరణంతో శివుణ్ణి చేరివుంటారు.
హర హర మహా దేవా ?