Home Health తిప్ప తీగతో ప్రయోజనాలే కాదు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి!

తిప్ప తీగతో ప్రయోజనాలే కాదు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి!

0

ఈ ప్రకృతి మానవాళికి భగవంతుడు ఇచ్చిన ఓ వరం. మన చుట్టూ ఉండే మొక్కల్లో చాలా రకాల మొక్కల గురించి ఎవరీకి అంతగా తెలియదు… అలాంటి మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి. ఇది మన ఇంటి పరిసరాల్లో, చుట్టు పక్కలా విరివిగా పెరుగుతుంది. కానీ దీని వల్ల కలిగే గురించి చాలా మందికి అవగాహన లేదు. తిప్పతీగను ఎక్కువగా ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడుతారు. దీన్ని ఇంగ్లిష్‌లో గిలోయ్ అని, సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. తిప్ప తీగ పంటపొలాలలోను, చేను కంచెలపైన ప్రాకి కనిపిస్తుంది.

tippateegaఈ తిప్పతీగ శరీరానికి అవసరమయ్యే వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఆయుష్షు ని, శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉండే మలినాలను తొలగిస్తుంది. చర్మం రంగు, నిగారింపు, మెరుపుని మెరుగపరుస్తుంది. చర్మ వ్యాధులతో బాధపడే వారికి తిప్పతీగ నూనెని ప్రభావిత ప్రాంతాల్లో రాస్తే త్వరగా నయం చేస్తుంది. చర్మం పై వచ్చే ముడతలను తగ్గిస్తుంది. ​ఉబ్బసం, ఆయాసం, శ్వాస వ్యవస్థ వంటి వాటిని నయం చేయడానికి తిప్పతీగ తో తయారు చేసిన ఆయుర్వేద మందులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

శరీరంలోని కణాలు దెబ్బ తినకుండా ఉండడానికి ఎంతో బాగా తిప్పతీగ సహాయం చేస్తుంది. అలానే ఎన్నో అనారోగ్య సమస్యలు తరిమికొట్టడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు అయిన డెంగ్యూ, మలేరియా వంటి సమస్యలు కూడా ఇది తగ్గిస్తుంది. అలానే తిప్పతీగ వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చాలా మంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. అటువంటి వాళ్ళు తిప్పతీగ తీసుకుంటే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అదే విధంగా ఆందోళన కూడా తగ్గుతుంది. జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి కూడా తిప్పతీగ బాగా ఉపయోగపడుతుంది.

​జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. నులి పురుగులు, ఆకలి లేకపోవటం, వాంతులు, అధికదాహం, కడుపు మంట, నొప్పి వంటి వాటిని నివారించడానికి సహాయపడుతుంది. ​కింటి చూపును పెంచడానికి పనిచేస్తుంది. ​అధిక జ్వరం, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులను తగ్గిస్తుంది. ​ఇందులో యాంటి ఆక్సిడెంట్స్, యాంటి ఇనఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీని వలన అర్ధ రైటిస్ వంటి వ్యాధులను నయం చేయడానికి, నొప్పిని తగ్గించడానికిచడానికి, గౌట్ వ్యాధులను దూరం చేసే లక్షణాలు తిప్ప తీగ లో ఉన్నాయి. ​ఇది అన్ని రకాల మధుమేహ వ్యాధులకు ఉపయోగిస్తారు. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

​తిప్ప తీగ కాండంని కిడ్నీ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ​తిప్ప తీగ ని నీడలో ఆరబెట్టి పొడిగా చేసి వాడుకోవచ్చు. ఇంకా పప్పు గా చేసుకోవచ్చు. జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ​వేడి పాలలో తిప్ప తీగ పౌడర్, తాటి బెల్లం, కొంచెం అల్లం రసం వేసి తాగితే కీళ్ల నెప్పులు తగ్గుతాయి. అయితే తిప్ప తీగని అధికంగా తీసుకుంటే మలబద్దకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ​ఆయుర్వేద వైద్యులు సమక్షంలో మాత్రమే తిప్పతీగ ను ఉపయోగించాలి.

తిప్పతీగ ఒక సమర్థవంతమైన హైపోగ్లైసిమిక్ ఏజెంట్, కాబట్టి ఔషధాలు వాడుతున్న డయాబెటిక్ వ్యక్తి అయితే, ఏ రూపంలో అయినా తిప్పతీగను తీసుకోవటానికి ముందు వైద్యుడిని సంప్రదించడమే మంచిది. ఇక గర్భిణీ మరియు చనుబాలిచ్చు స్త్రీలు ఏ రూపంలోనూ తిప్పతీగను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు. తిప్పతీగ రోగనిరోధక వ్యవస్థను మరింత చురుకుగా పనిచేయటానికి ఉద్దీపన చేయగల ఒక అద్భుతమైన రోగనిరోధక సూత్రం. కాబట్టి, మీరు ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే, తిప్పతీగను తీసుకునే ముందు ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాలి.

Exit mobile version