తామర అనేది చర్మ సంబంధ అంటువ్యాధి. ఇది వివిధ రూపాల్లో వస్తుంది. మరియు ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. తామర ఉన్న వ్యక్తి తామర ఉన్న ప్రదేశాన్ని తాకడం, అతను వాడిన దుస్తులు వాడటం వల్ల ఇది వ్యాపిస్తుంది. తామర వల్ల చర్మం పొడిబారి పొలుసులు ఏర్పడటం, మచ్చలు పడటం, చర్మం దురద పెట్టడం జరుగుతుంది. ఇది ఏ వయస్సు వారికైనా వచ్చే ఈ అంటువ్యాధి చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
ఇది చర్మం పై ఎక్కడైనా రావొచ్చు. ముఖ్యంగా తడిగా ఉండే ప్రదేశాల్లో గజ్జలు, చంకల్లో ఎక్కువగా వస్తుంది. ఇది వాతావరణం చల్లగా ఉన్నపుడు ఎక్కువగా వస్తుంది. చాలా మంది తామరతో బాధపడుతూ అష్టకష్టాలు పడుతుంటారు. అలాంటి తామరను తగ్గించుకొని ఉపశమనం పొందడానికి ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
పసుపు అనేక చర్మ వ్యాధులను నయం చేస్తుంది మరియు మంటని తగ్గిస్తుంది. పసుపు యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని రక్షిస్తుంది మరియు తక్కువ సమయంలో గాయం నయం అయ్యేట్టు చేస్తుంది.
స్వచ్ఛమైన కలబంద జెల్ చర్మ దురదని తగ్గించి చర్మం చల్లగా అయ్యేలా చేస్తుంది. మీరు తామర లేదా సోరియాసిస్‌తో బాధపడుతుంటే, మీరు కలబంద మొక్కను పెంచుకోండి. దానివల్ల మీరు కెమికల్స్ లేని స్వచ్ఛమైన జెల్ ను రాసుకోవచ్చు.
ఆలివ్ ఆయిల్ ఒమేగా-3 ఫాటీ యాసిడ్ ను కలిగి ఉన్న సహజ నూనె. ఒమేగా -3 లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. తామర ఉన్న చోట గోరు వెచ్చని ఆలివ్ ఆయిల్ ను రాయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.
చేప నూనెలో కూడా ఒమేగా -3 ఫాటీ యాసిడ్స్ ఉంటాయి. రోజుకు 3-10 గ్రాములు తీసుకోవడం వల్ల తామర తగ్గడానికి ఇది సహాయపడుతుంది.
అవిసె గింజల్లో ఒమేగా -3 ఫాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అవి శరీరంలో అరాకిడోనిక్ ఆమ్లం అనే రసాయనాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అవిసె గింజలను రోజు కొంచెం తీసుకోవడం వలన ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి.
పొడి, పగిలిన చర్మాన్ని నయం చేయడానికి వెజిటేబుల్ షార్టేనింగ్‌ని రాస్తే మంచి ఫలితం ఉంటుంది. తామర ఉన్న చోట వెజిటబుల్ షార్టేనింగ్ ని రాసి, దాని ప్లాస్టిక్ ర్యాప్‌తో కప్పి, దానిపై సర్జికల్ టేప్ వెయ్యండి. రెండు మూడు గంటలు అలాగే ఉంచితే ఉపశమనం దొరుకుతుంది.
టీ ట్రీ ఆయిల్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటిసెప్టిక్, నౌరిషింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి అనేక రకాల చర్మ వైదులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్ ను టీట్రీ ఆయిల్ కలిపి చర్మానికి రాయడం వల్ల దురదను తగ్గించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది.