Home Health మలబద్దకం నుండి బయటపడేందుకు ఇవి తప్పక పాటించండి

మలబద్దకం నుండి బయటపడేందుకు ఇవి తప్పక పాటించండి

0

దైనందిన జీవితంలో చాలా మంది తరచుగా ఎదుర్కునే సమస్య మలబద్ధకం. ప్రేగు కదలికలు సక్రమంగా లేనప్పుడు మల విసర్జన కష్టమవుతుంది. దీన్నే మలబద్దకం అంటారు. వేళకు తినకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, జీర్ణం కానీ ఆహరం తీసుకోవడం లాంటి కొన్ని కారణాలు మలబద్దకానికి దారితీస్తాయి. ఈ సమస్య ఉన్నప్పుడు అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉంటుంది.

మలబద్దకంఈ సమస్య నుండి బయటపడటానికి చాలామంది మందులు వేసుకుంటారు. మందులు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి కానీ, తర్వాతి కాలంలో అనేక దుష్ప్రభావాలకు దారితీస్తాయి. కాబట్టి ఈ సమస్యనుంచి బయటపడేందుకు ఆముదం మీకు చక్కగా ఉపయోగపడతుంది. ఆముదంలోని ప్రత్యేక గుణాలు మలబద్దకం సమస్యని చాలావరకూ అదుపులోకి తెస్తాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మలబద్దకం నుండి బయటపడేందుకు మీ పొట్టపై ఆముదంతో మృదువుగా మర్దనా చేయండి. ఆముదంతో ఇలా చేయడం వల్ల కండరాల సంకోచాన్ని పెంచి, మలాన్ని విచ్చిన్నం చేస్తుంది.. ఈ కారణంగా మలవిసర్జన సజావుగా జరిగేలా చూస్తుంది.

ఒక స్పూన్ ఆముదంలో, ఒక కప్పు నారింజ రసం కలిపి తాగండి. దీన్ని రోజుకోసారి తీసుకోవడం వల్ల అద్భుత ఫలితాలుంటాయి. నారింజ రసంలోని ఫైబర్ మరియు ఆముదం మలవిసర్జనను సజావుగా సాగించడంలో సహాయపడుతాయి. క్రమంగా మలబద్దకం సమస్య తగ్గుతుంది.

నిమ్మరసం, ఆముదంతో మలబద్ధక సమస్యను నివారించవచ్చు. దీనికి ఒక కప్పు నిమ్మరసంలో, ఒక టేబుల్ స్పూన్ ఆముదంను కలిపి నూనె అడుగున పేరుకోకముందే తాగండి. నిమ్మరసం యొక్క ఆమ్ల స్వభావం మీ ప్రేగు కదలికలను తేలిక చేయడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. దీనివలన మలబద్ధకం సమస్య త్వరగా తగ్గుతుంది.

మలబద్దకాన్ని నివారించడానికి పాలు, ఆముదం మిశ్రమం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక కప్పు పాలలో 1 టేబుల్ స్పూన్ ఆముదం నూనెను కలిపి పాలు, ఆముదం నూనె రెండింటినీ బాగా కలిపిన తర్వాత, అడుగుభాగాన నూనె పేరుకోకముందే తాగేయాలి.

Exit mobile version