Home Health ఎముకలు ధృడంగా ఉండాలంటే ఇవి తప్పక తీసుకోవాల్సిందే!

ఎముకలు ధృడంగా ఉండాలంటే ఇవి తప్పక తీసుకోవాల్సిందే!

0

ఐరన్ మరియు విటమిన్ డి వంటి సూక్ష్మపోషకాల మాదిరిగా, కాల్షియం కూడా మన శరీరంలో లభించే ముఖ్యమైన ఖనిజంలో ఒకటి. శరీర ఎముకలు మరియు కండరాలతో పాటు నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి కాల్షియం సహాయపడుతుంది. 90% కాల్షియం మన శరీరంలో ఎముకలు మరియు దంతాలను బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని ఎముకల నిర్మాణాన్ని సరిగా పనిచేసే సామర్థ్యాన్ని ఇస్తుంది.

Ingredients high in calcium10% కాల్షియం మన శరీరంలో ఉండే రక్తంనీ గడ్డ కట్టకుండా ఉండడానికి, కండరాలు, నరాల పనితీరు మెరుగుపర్చడానికి ఉపయోగించబడుతుంది. ఇది హృదయ స్పందన క్రమబద్ధీకరణకు దోహదం చేస్తుంది. కాల్షియం అధికంగా ఉండే ఆహారపదార్థాలు ఏంటో చూద్దాం..

పెరుగు :

మనం పాల ద్వారా ఇళ్లలో తయారు చేసుకునే పెరుగు చాలామంచిది. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. బయట దొరికే యోగార్ట్ అంత మంచిది కాదు. అందువల్ల రోజూ ఇంట్లో పెరుగు తయారు చేసుకోని తినడం చాలా మంచిది. పాలలో లాగే పెరుగులో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే లాక్టోజ్ కూడా ఆరోగ్యానిక చాలా మంచిది మరియు ఎముకలను ధృడంగా చేస్తుంది.

సార్డినెస్ :

ఈ సముద్రపు చేపలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది చేపల మార్కెట్లో మనకు ఈజీగా దొరుకుతుంది. రేట్ కూడా చాలా తక్కువే. ఇక నాన్ వెజిటేరియన్స్ అందరూ దీన్ని లాగించేయొచ్చు. సముద్ర తీర ప్రాంతాల వారందరికీ ఈ చేపల గురించే తెలిసే ఉంటుంది. ఈ చేపల ద్వారా మీకు రోజుకు కావాల్సిన 33% యూనిట్ల కాల్షియం లభిస్తుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా వారానికి ఒకసారి ఈ చేపలను తినండి.

చీజ్ :

చీజ్ కూడా మనకు ఈజీగా దొరుకుతుంది. ఇది కూడా పాల ఉత్పత్తికి సంబంధినదే. దీనిలోనూ కాల్షియం ఫుల్ గా ఉంటుంది. పర్మెస్యాన్ చీజ్ లో అత్యధిక శాతం కాల్షియం ఉంటుంది.

అంజీరపండ్లు :

ఎండిన అంజీర పండ్లలోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. దీంట్లో కాల్షియంతో పాటు ఫైబర్స్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లోనూ అధికంగా కాల్షియం ఉంటుంది. తోటకూర, పాలకూర, బచ్చలికూరలతో పాటు బ్రోకోలిలోనూ కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల ఎక్కువగా వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉండాలి.

బాదం :

బాదంలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. అలాగే కాల్షియం కూడా దీనిలో అధికంగా ఉంటుంది. అయితే వీటిని మోతాదుకు మించి తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే వీటని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుంది. మోతాదుకు మించకుండా తినండి.

ప్రౌన్స్ :

ప్రౌన్స్ లో అధిక శాతం కాల్షియం ఉంటుంది. అయితే వీటిని ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉన్న కాల్షియం మోతాదు తగ్గిపోతుంది. అందువల్ల వీటిని ఎక్కువగా వేయించకుండా తింటే మంచిది. దీంతో అందులో ఉన్న కాల్షియం గుణాలన్నీ మీ ఒంటపడతాయి.

నువ్వులు :

నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా గర్భిణీలు ఎక్కువగా నువ్వులతో తయారు చేసిన లడ్డూలు తింటూ ఉంటారు. దీంతో మహిళలు వారు కోల్పొయిన కాల్షియం పొందుతారు. ప్రతి ఒక్కరూ కూడా నువ్వులతో తయారు చేసిన పదార్థాలను ఆహారంగా తీసుకుంటే సులభంగా కాల్షియం పొందవచ్చు.

ఆరెంజ్ :

ఆరెంజ్ లో కాల్షియం బాగానే ఉంటుంది. వీటిని రోజూ తింటూ ఉంటే శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. అందువల్ల ఆరెంజ్ పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

సోయా పాలు :

సాధారణ పాలతో పోల్చితే సోయా పాలలో కాల్షియం అధికంగా ఉండదు. కానీ ఒక ఔన్స్ పాలలో ౩౦౦ మి.గ్రా కాల్షియం ఉంటుంది. అందువల్ల వీటిని తీసుకోవడం కూడా చాలా మంచిది.

వోట్ మీల్ :

కార్న్ ఫ్లేక్స్ కంటే వోట్స్ ఆరోగ్యకరమైనవి. రేట్ కూడా అంత ఎక్కువేమి ఉండదు. మన కిరాణా దుకాణాల్లో ఈజీగా వోట్స్ లభిస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన కాల్షియం వీటి ద్వారా అందుతుంది. అందువల్ల మీరు తీసుకునే ఆహారంలో వోట్ మీల్ ఉండేటట్లు చూసుకోండి.

బెండ :

దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక గిన్నె బెండకాయ కూరలో 175 మి .గ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే వందగ్రాముల బెండలో కాల్షియం 82 మి.గ్రా కాల్షియం ఉంటుంది.

పీతలు :

పీత మాంసంలో అనేక పోషకాలుంటాయి. మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఒక కప్పు పీత మాసంలో కాల్షియం 124 మి.గ్రా ఉంటుంది. అందువల్ల పీతలను కూడా తింటూ ఉండాలి.

ఉడికించిన గుడ్లు :

ఒక ఉడికించిన గుడ్డులో 50 మి .గ్రా కాల్షియం ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీలైనంత వరకు రోజుకొక ఉడకబెట్టిన గుడ్డునైనా తినండి.

ఖర్జూర :

ఇందులో కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటుంది. వీటిని తినడానికి చాలామంది ఇష్టపడతారు. అందువల్ల వీటిని కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.

 

Exit mobile version