Home Entertainment This Analysis Of RGV On Theatres, Cinema & OTTs Is On-Point

This Analysis Of RGV On Theatres, Cinema & OTTs Is On-Point

0

Credits: FB Timeline

షూటింగ్స్ ఆపేసి మరి నిర్మాతలు ఎందుకు సమ్మె చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఓటీటీల మూలంగా ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదని అంటున్నారు. కానీ ఓటీటీ వాళ్ళేమో మాకు చందాదారులు పెరగడం లేదని అంటున్నారు. కానీ ఇవి రెండింటికీ కారణం ఒకటే అది యూట్యూబ్. జనాలకి ఎంటర్ టైన్మెంట్ ఎక్కడ వస్తుందా అని చూస్తున్నారు, అది యూట్యూబ్ లో దొరుకుతుంది. అలాంటప్పుడు రెండు గంటలు వెచ్చించి ప్రేక్షకులు సినిమా చూడటానికి ఆసక్తి చూపించడం లేదు. యూట్యూబ్ లో అయితే అన్ని ఉంటున్నాయి. వార్తలు, సినిమా సాంగ్స్ అన్ని అందుబాటులో ఉంటున్నాయి.

This Analysis Of RGV On Theatres, Cinema & OTTs Is On-Point

ఇంకొక శత్రువు సోషల్ మీడియా. యూట్యూబ్, సోషల్ మీడియా కారణంగానే జనాలకి సినిమాల మీద ఆసక్తి తగ్గుతుంది. వాళ్ళకి కావాల్సిన ఎంటర్ టైన్మెంట్ అందులో దొరుకుతుంది. సగం మంది సినిమాలను చూడటం తగ్గించి సోషల్ మీడియా మీద పడుతున్నారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ లో రాజమౌళి, కే జీ యఫ్ బెంచ్ మార్క్ ని రీచ్ అవడం ఎవరి వల్ల సాద్యం కావడం లేదు. అంతగా ఖర్చు పెడితే అవుతుందా లేదా తగ్గిద్దామంటే అసలు జనాలు వస్తారో లేదో అనే డౌట్ కూడా వస్తుంది. రాజమౌళి ఇచ్చిన కంటెంట్ చూసిన తర్వాత మిగతావి చూసేందుకు ఇష్టం చూపించడం లేదు. రాజమౌళి, యూట్యూబ్ సినిమా ఇండస్ట్రీకి ఉన్న అతిపెద్ద శత్రువులు. రాజమౌళి అణుబాంబు అయితే యూట్యూబ్ మిషన్ గన్. జనాలు నిద్ర లేవగానే ఓటీటీ ఓపెన్ చెయ్యరు, యూట్యూబ్ చూస్తారు

~ RGV

Ee analysis bagundi kadha, kani naku oka doubt undi? Mana industry okkate ila enduku undi, ee social media, youtube anni Tamil & Malayalam audience ki unnai ga, kani akkada industries mana antha worst situation lo lev kadha, particular ga malayalam movies, vaalaki emi kastalu, nastalu leve, chakkaga janalu chustunnaru, decent ga aadutunai almost anni films, so mundhu manam cinema lu baga tiyyali aa cost of production ni tagginchukunte saganiki paina kasthalu akkade teeripotai, ala kaakunda maa cinema grand uu maa cinema granduu ani audience ni mabbi pedadam ani chuste, audience emi antha verri ga leru, manam cheppindi alla nammi theatres ki raadaniki, cinema theatres ni industry ki sathruvulu evaro kaadu, cinema vaalle cinema ki athi pedda sathruvulu. Twaraga melukondi manchi kathalu meedha concentrate cheyyandi, aa remuneration lu, aa budget lu, aa cost of production lu, aa ticket rate lu anni tagginchukondi, nuvvu pilavadam kaadu, appudu janalu automatic ga vastaru theatres ki, maname tappudu adugulu vesi, janalani nindiste etla ayya… So wake up before everything is gone..

Exit mobile version