Home Health ఈ సమస్యలు ఉన్నవారు జామకాయకు దూరంగా ఉండడమే మంచిది!

ఈ సమస్యలు ఉన్నవారు జామకాయకు దూరంగా ఉండడమే మంచిది!

0
వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే పండ్లలో జామపండ్లు ముందుంటాయి. జామపండు ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే జామపండు తినే సమయంలో పండు అంత రుచిగా అనిపించినా అందులో ఉండే విత్తనాలే కాస్త ఇబ్బందిగా ఉంటాయి. జామపండులోని విత్తనాలు జీర్ణం కావనే అభిప్రాయంలో కొందరు ఉంటారు. అందుకే జామపండ్లు చిన్న పిల్లలు తినొచ్చా, తినకూడదా అనే సందేహం చాలా మందికి ఉంది.
జామపండు తింటే అందులో విత్తనాలు జీర్ణం కావు అని అనుకోవడం ఒక అపోహ మాత్రమే. నిజానికి జామపండు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరిగే పిల్లలకు జామపండు ఆహారంలో భాగంగా ఇవ్వాలి. ఎందుకంటే వీటిలో ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. దీని వల్ల వయసుకు తగినట్టుగా పెరుగుతారు. జామ పండులోని ఫోలిక్ ఆమ్లం పిల్లలలో మెదుడు, వెన్నెముక సంబంధిత లోపాలను నివారించడంలో సహాయపడుతుంది.
ఇంకా పిల్లలలో నాడీ, ప్రసరణ వ్యవస్థ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది. జామపండులో విటమిన్ ‘సి ‘పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒక జామపండులో నారింజ పండు కంటే నాలుగు రేట్లు ఎక్కువ విటమిన్ ‘సి ‘ఉంటుంది. కంటి చూపు తగ్గకుండా ఉండడానికి జామపండు సహాయపడుతుంది. జామకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలలో జీవక్రియను మెరుగు పరచడంలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని కూడ నివారిస్తుంది.
అంతే కాదు రక్త ఉత్పత్తిని పెంచుతుంది. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పిల్లలను క్యాన్సర్ ప్రమాదం నుండి నిరోధించడంలో సహాయపడడతాయి. ఇది అల్జీమర్స్, పార్కిన్స్ వ్యాధులు, హైప్రాక్సియా వంటి రుగ్మతల నుంచి కాపాడుతుంది. జామకాయలో క్యాల్షియం, పోషకాలు వున్నాయి. ఇవి పిల్లలలో ఎముకలు అభివృద్ధికి సహాయపడుతుంది. జామపండు విత్తనాల్లో లినోలెయిన్, ఫినోలిక్ వంటి కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పిల్లల మెదుడు, ఇతర కణజాల వ్యవస్థల అభివృద్ధికి సహాయపడతాయి.
అయితే గ్యాస్ ట్రబుల్ తో బాధపడే వారు జామ పండును తినకపోవటమే మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే జామ పండులో ఉండే విటమిన్ సి ప్రక్టోస్ లు ఎక్కవగా ఉండటం వల్ల కడులో ఉబ్బరంగా ఉండే భావన కలుగుతుంది. అందుకే గ్యాస్ తో బాధడేవారు ఈ పండును దూరంగా పెట్టటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారు రాత్రి సమయంలో దీనిని తీసుకోవటం వల్ల సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంటుంది.
రాత్రి సమయంలో జామపండు తినటం వల్ల కడుపు ఉబ్బరంతో నిద్ర సరిగా పట్టని పరిస్ధితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు జామకాయను ఎంత మితంగా తింటే అంత మంచిది. 100 గ్రాముల జామలో తొమ్మిది గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. అలాగే జామకాయ, అరటికాయ ఒకేసారి తినకూడదు. జామ పండు తిన్న తర్వాత వెంటనే అరటి పండు తింటే కడుపులో తిప్పినట్లు అవుతుంది. తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్ సమస్యలు అధికంగా వస్తాయట.

Exit mobile version