Home Health గ్యాస్ ప్రాబ్లెమ్ ఉందా అయితే ఈ చిట్కాలు తప్పక పాటించండి

గ్యాస్ ప్రాబ్లెమ్ ఉందా అయితే ఈ చిట్కాలు తప్పక పాటించండి

0

ప్రస్తుత ఆహారపు అలవాట్లతో చాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్య గ్యాస్ ప్రాబ్లెమ్. గ్యాస్ అనేది రెండు విధాలుగా సంభవించవచ్చు. ఒకటి తిన్నప్పుడు రెండోది త్రాగినప్పుడు. ఈ సమస్య వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, ఉదర భారము, గుండెల్లో మంటకు దారితీస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆహారం జీర్ణం అయినప్పుడు హైడ్రోజన్, మీథేన్ లేదా కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులను బహిష్కరించి కడుపులో నిల్వ చేయవచ్చు.

Tips for reducing gasఅటువంటి వాయువు సరిగా లేదా అధికంగా బహిష్కరించబడకపోతే, అది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు, ముఖ్యంగా బీన్స్, క్యాబేజీ, చిక్కుళ్ళు లేదా చక్కెర పానీయాలు కడుపు ద్వారా సులభంగా జీర్ణమయ్యేవి కావు. అందుకనే అటువంటి ఆహార పదార్ధాలను దూరం పెట్టండి. వాటితో పాటు మరికొన్ని చిట్కాలు పాటిస్తే గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

వాము అందరి ఇళ్లల్లో దోరికేదే. ఈ విత్తనాలలో థైమోల్ అనే పదార్ధం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కాబట్టి ఆహారాన్ని తినడం వల్ల వచ్చే గ్యాస్ ని నివారించాలనుకుంటే, 1/2 టీస్పూన్ వాము విత్తనాలను నీటిలో వేసి రోజూ ఉడకబెట్టి ఈ నీటిని త్రాగాలి.

అలాగే జీలకర్ర కూడా గ్యాస్ సమస్యకు ఉపశమనం ఇస్తుంది. జీలకర్రలోని ముఖ్యమైన నూనె లాలాజల గ్రంథులను ఉత్తేజపరుస్తుంది, ఆహారాలను బాగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను 2 కప్పుల నీటిలో ఉంచండి, 10-15 నిమిషాలు ఉడకబెట్టి, తిన్న తర్వాత దాన్ని తాగాలి.

1/2 టీస్పూన్ ఇంగువ పొడి 1 స్పూన్ వెచ్చని నీటితో కలిపి త్రాగాలి. ఇలా చేయడం ద్వారా గ్యాస్ సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చు.

ఒక టీస్పూన్ నిమ్మరసంతో ఒక టీస్పూన్ మెత్తగా తురిమిన అల్లం కలపండి దాన్ని భోజనం తర్వాత తినండి, తద్వారా గ్యాస్ సమస్య ఉండదు.

ఉదయాన్నే టీ తాగేటప్పుడు కొంచెం అల్లం ముక్కను అందులో వేసుకుని తాగినా త్వరిత ఉపశమనం ఉంటుంది.

 

Exit mobile version