Home Health కిడ్నీలో రాళ్లు తగ్గాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసా ?

కిడ్నీలో రాళ్లు తగ్గాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసా ?

0

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఈ కాలంలో చాలామందిని ఇబ్బంది పడుతున్న సమస్య కిడ్నీలో స్టోన్స్. యూరిన్ లో ఉండే యూరిక్ ఆసిడ్, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, ఆక్సాలిక్ ఆసిడ్స్ నుండి ఇవి తయారవుతాయి. అయితే ఈ రాళ్లు ఐదు మిల్లీ మీటర్ల కంటే తక్కువున్నట్లయితే యూరిన్ లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. కానీ పెద్ద స్టోన్స్ మాత్రం యూరిన్ నుండి బయటకు వెళ్లవు. బాధని కలుగ చేస్తాయి. ఇవి యూరిన్ యొక్క ఫ్లో ని అడ్డుకుంటాయి. అలాగే, యూరిన్ లో బ్లడ్ వంటి లక్షణాలను కలుగ చేస్తాయి. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా ఈ స్టోన్స్ తో బాధపడతారు.

tips to reduce kidney stones?కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటానికి మెడికల్, జెనెటిక్ కండిషన్స్ కూడా కారణం కావచ్చు. బ్లడ్ లో ఎక్కువ కాల్షియం ఉండడం వల్ల, కాల్షియం లేదా విటమిన్ డీ సప్లిమెంట్లని ఎక్కువ కాలం పాటూ తీసుకోవటం, పాలకూర, నట్స్, చాకొలేట్ వంటి ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం, అధిక బరువుని కలిగి ఉండడం, ఫైబర్, మెగ్నీషియం తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం కూడా కిడ్నీ లో రాళ్లు ఏర్పడడానికి కారణం కావొచ్చు.

కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లయితే కిడ్నీ నుండి బ్లాడర్ కు యూరిన్ ని తీసుకువెళ్ళే ట్యూబ్ లోకి చేరి భరించలేనంత నొప్పి వస్తుంది. వీపు కింద భాగం నుండి పొట్ట కింద భాగంలోకి వచ్చే నొప్పి, వికారం, వాంతులు, ఎక్కువ సార్లు బాత్రూం కి వెళ్ళాల్సి రావడం, యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు నొప్పి, మంట ఉండడం, యూరిన్ పాస్ చేయాలనిపించడం కానీ పూర్తిగా పాస్ చేయలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

మరి కిడ్నీలో రాళ్లు తగ్గాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకుందాం.

కిడ్నీ లో రాళ్లు కరిగిపోవాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజుకి కనీసం ఆరు నుండి ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. అలాగే కాల్షియం ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వంటివి చేయాలి. అంటే పాలు, పాల పదార్ధాలు వంటివి తీసుకోవాలి. అలాగే పాలకూర తినడాన్ని వీలయినంత తగ్గించాలి. అలాగే ఉప్పు తక్కువగా తీసుకోవడం వంటివి చేయాలి. షుగర్, ఆర్టిఫీషియల్ స్వీటెనర్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు. అలాగే రెడ్ మీట్ తినడాన్ని తగ్గించాలి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. బరువుని అదుపులో ఉంచుకోవాలి.

పండ్లూ కూరగాయలు బాగా తీసుకోవడంతో పాటు రోజుకు నాలుగు టేబుల్ స్పూన్ల తాజా నిమ్మరసం తీసుకోండి. ఇలా రోజుకి రెండు మూడు సార్లు మూడు రోజుల వరకూ చేయవచ్చు. దానిమ్మ గింజలు, రసం రెండూ మంచివే. రోజుకి ఒక దానిమ్మ పండు తినవచ్చు, లేదా అప్పుడే తీసిన దానిమ్మ రసం ఒక గ్లాసు తాగవచ్చు. ఫ్రూట్ సలాడ్ లో దానిమ్మ గింజలు కూడా కలపవచ్చు.

రెగ్యులర్ గా పుచ్చకాయ తీసుకోవడం కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్ లోనే కాదు, అసలు స్టోన్స్ ఫార్మ్ అవ్వకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది.

రాజ్మా కూడా ఈ సమస్యకి చాలా మంచి పరిష్కారమే. రాజ్మా సూప్, సలాడ్ వంటివి తీసుకోవచ్చు. కొంతమంది రాజ్మా తినకూడదు అని అనుకుంటారు. కానీ ఎలాంటి జంకు లేకుండా రాజ్మా తినవచ్చు.

 

Exit mobile version