Home Health ఇవి షాంపూలో కలుపుకొని స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది!

ఇవి షాంపూలో కలుపుకొని స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది!

0

అందం అంటే ముఖసౌందర్యం మాత్రమే కాదు జుట్టు కూడా కీలకమే. అందుకే అందాన్ని రెట్టింపు చేసే జుట్టు విషయంలో చాల జాగ్రత్తలు తీసుకోవాలి. కాస్త శ్రద్ద పెడితే అందమైన ఒత్తైన జుట్టును పొందవచ్చు. పురాణం కాలంలో జుట్టుకు కుంకుడు కాయలు వాడేవారు కాబట్టి జుట్టు సమస్యలు వచ్చేవి కాదు. కానీ ఈ రోజుల్లో తల రుద్దుకోవటానికి కుంకుడు కాయలు మానేసి షాంపూలను వాడుతున్నారు.

Tips to reduce hair fallషాంపూలలో ఉండే హానికరమైన రసాయనాలు జుట్టును పాడుచేస్తాయి. అలా కాకుండా షాంపూలో కొన్ని పదార్ధాలను కలపి వాడితే జుట్టు రాలడం తగ్గిపోతుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరిని చాలా పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. షాంపూలో ఒక స్పూన్ ఉసిరి నీటిని కలిపి వాడడం వల్ల జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

షాంపూలో రెండు చుక్కల బాదం నూనెను కలిపి తలను రుద్దుకోవాలి. బాదం నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన జుట్టు సమస్యల పరిష్కారంలో మీకు బాగా సహాయపడతాయి.

షాంపూలో గ్లిజరిన్ కలిపి తల రుద్దుకోవాలి. అయితే గ్లిజరిన్ మాత్రం 5 చుక్కలు మాత్రమే వేయాలి. గ్లిజరిన్ వేయటం వలన జుట్టుకు అవసరమైన తేమ అంది జుట్టు బలంగా అందంగా ఉంటుంది.

షాంపూలో రెండు స్పూన్ల రోజ్ వాటర్ ని కలిపి తల రుద్దుకోవాలి. ఈ విధంగా రోజ్ వాటర్ ని కలపటం వలన జుట్టుకు అవసరమైన తేమ అందుతుంది.

షాంపూలో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి తలను రుద్దుకోవాలి.నిమ్మరసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తలలో చుండ్రు,దురదను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

 

Exit mobile version