ఆయుర్వేదంలో తేనెది చాలా కీలకమైన పాత్ర. ఏ ఆయుర్వేద ఔషధం తయారు చేసిన అందులో తేనే ఉండాల్సిందే. అంతెందుకు తేనె ని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలలో ఒకటిగా భావిస్తారు. దీనిని ఒక మంచి స్వీటెనర్ గా కూడా యూజ్ చేస్తారు. ఎన్నో ట్రెడిషనల్ మెడిసిన్స్ లో కూడా తేనె ని వాడతారు. తేనె వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని నిత్యం వాడడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు.
- బరువు తగ్గించడం లో తేనె ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రాత్రి నిద్రకి ముందు ఒక స్పూన్ తేనె తీసుకోవచ్చు, లేదా పొద్దున్న నిద్ర లేవగానే పరగడుపున గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని తాగవచ్చు. బ్రేక్ ఫాస్ట్ కి, వర్కౌట్ కి ముందు తేనె తీసుకుంటే ఆ ఎనర్జీ బూస్ట్ రోజంతా ఉంటుంది అంటారు నిపుణులు. తేనె ని నాచురల్ మాయిశ్చరైజర్ గా కూడా వాడుకోవచ్చు. చలికాలం లో చాలా మంది ఎదుర్కొనే పెదవులు పగిలే సమస్య కి కూడా తేనె మంచి పరిష్కారం.
- తేనె మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మెటబాలిక్ స్ట్రెస్ ని ప్రివెంట్ చేసి బ్రెయిన్ ని కామ్ గా ఉంచుతుంది. దగ్గుకి తేనెని మంచి ఇంటి వైద్యంగా చెబుతారు. ప్రత్యేకించి చిన్నపిల్లల్లో నిద్రలో వచ్చే దగ్గు తగ్గించి మంచి నిద్ర పట్టేలా చేస్తుందని అంటారు. నిద్ర పట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అందుకు కూడా తేనె దగ్గర పరిష్కారం ఉంది. నిద్ర కి ముందు గోరు వెచ్చని పాలలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే హాయిగా నిద్ర పోతారని నిపుణుల మాట.
- తేనె లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వలన గాయాలని మాన్పడానికి కూడా తేనె ఉపయోగపడుతుంది. తేనె లో చుండ్రు ని తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. అంతే కాక తేనె వాడడం వల్ల హెయిర్ స్మూత్ గా సాఫ్ట్ గా తయారవుతుంది. అయితే, ఈ మధ్యకాలం లో తేనె కల్తీ జరుగుతోందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.
- కంపెనీ తేనెలన్నీ ఎక్కువగా ప్రాసెస్ చేసే అమ్ముతుంటాయి. ఇలా అధికంగా ప్రాసెస్ చేయబడ్డ తేనెల వలన ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. మార్కెట్‌లో దొరికే తేనె కంటే, తేనె పట్టు నుంచి సేకరించిన తేనెను కొనుక్కోవడమేమంచిదని సూచిస్తున్నారు పరిశోధకులు. తేనెపట్టు నుంచీ తీసిన తేనెకు మాత్రమే అసలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయ అంటున్నారు నిపుణులు.
- గ్రామాలలో నివసించే ప్రజలు మాత్రమే తేనెతో ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన తేనె దొరికితే.. నగరాల్లో మాత్రం కల్తీ తేనె అందుబాటులో ఉంది. తేనె లో ఉన్న సుగుణాలన్నీ కల్తీ జరిగిన తేనె లో ఉండవు, పైగా అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అయితే, మరి మీరు వాడే తేనె మంచిదో కాదో ఎలా తెలుస్తుంది? ఇక్కడో పద్ధతి ఉంది చూడండి. ఈ పద్ధతి ద్వారా మీరు వాడే తేనె లో పంచదార కలిసి కల్తీ జరిగిందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు.
- ఒక టీస్పూన్ తేనెను ఒక గ్లాస్ నీటిలో వేసి చూడండి. తేనె త్వరగా కరిగిపోతే అది నకిలీదని గుర్తించండి. స్వచ్ఛమైన తేనెను నీటిలో వేయగానే గ్లాస్ అడుగు భాగంలోకి చేరి కొంత సేపు వరకు అలాగే ఉంటుంది. ఇలా స్వచ్ఛమైన తేనెను గుర్తించవచ్చు. వేలిపై చిన్న తేనె చుక్కను వేసి చూడండి. నకిలీ తేనె అయితే సులభంగా అటు, ఇటు నీళ్లు వెళ్లినట్లు వెళ్తుంది. అదే స్వచ్ఛమైన తేనె అయితే ఆ చుక్క కదలకుండా అలాగే ఉంటుంది. ఇలా నకిలీ తేనెను కనిపెట్టవచ్చు.
- బ్లోటింగ్ పేపర్ లేదా తెలుపు రంగు వస్త్రంపై చిన్న తేనె చుక్కను వేసి చూడండి. స్వచ్ఛమైన తేనె అయితే ఆ వస్తువులు తేనెను లోపలికి పీల్చుకోవు. అలాగే మరకలు కూడా పడవు. నకిలీ తేనె అయితే సులభంగా మరకలు పడతాయి. లోపలికి పీల్చుకోబడుతుంది.
- స్వచ్ఛమైన తేనె మండుతుంది. అంటే.. మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఒక అగ్గిపుల్లను తేనెలో ముంచి దాన్ని పెట్టెకు రాపిడి కలిగించాలి. స్వచ్ఛమైన తేనె అయితే అగ్గిపుల్ల మండుతుంది. అదే కల్తీ అయిన తేనె అయితే అగ్గిపుల్ల మండదు. తేనెలో పత్తి ఒత్తిని ముంచి వెలిగిస్తే వెలుగుతుంది. ఈ సూచను పాటించేటప్పుడు మంటతో జాగ్రత్తగా ఉండాలి.
- తేనె అసలుదో నకిలిదో గుర్తించాలంటే వెనిగర్ ద్వారా ఇట్టే పట్టేయచ్చు. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తేనె డబ్బాలోని రెండు, మూడు చుక్కల తేనెను వెనిగర్ నీటిలో వేయండి. వెనిగర్ వాటర్ లో ఉన్న ఆ తేనె నురుగులు వస్తే మాత్రం అది కచ్చితంగా కలుషితమైనదే. కొద్దిగా తేనెను తీసుకుని పాన్‌పై వేసి వేడిచేయాలి. అందులో నుంచి నురగ వస్తుంటే అది నకిలీ తేనె అని గుర్తించాలి.
- స్వచ్ఛమైన తేనె మృదువుగా అనిపిస్తుంది. పొరలుగా విడిపోదు. తియ్యని వాసన వస్తుంది. స్వచ్ఛమైన తేనెను తిన్నప్పుడు గొంతులో మండినట్లు కూడా అనిపిస్తుంది. ఈ విధంగా తేనె కల్తీ అయిందో, లేదో సులభంగా తెలుసుకోవచ్చు.