Home Unknown facts Tirumala shri vaari aalayam lo pilli chesey ee vintha telisthe ascharyapotharu

Tirumala shri vaari aalayam lo pilli chesey ee vintha telisthe ascharyapotharu

0

ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక ప్రత్యేకం. ఇక్కడ ఏడుకొండలలో వెలసిన ఆ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొనుటకు భక్తులు ఎప్పుడు అధికసంఖ్యలో ఉంటారు. ఎందుకంటే ప్రస్తుత కలియుగంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కోరికలను తీర్చే భవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. ఇంకా కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని చెబుతారు. ఇంతటి విశేషం ఉన్న ఈ స్వామివారి ఆలయంలో ఒక పిల్లి అక్కడి పూజారుల దృష్టిని బాగా ఆకట్టుకుందంటా. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. tirumalaశ్రీ వారి గర్భగుడిలో ఒక పిల్లి అనుచానంగా నివసిస్తు వస్తోంది. మాములుగా శ్రీ వారి ఆలయం బంగారు వాకిలి తలుపులు తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాత సేవ సమయంలో అర్చకులచే తెరువబడుతాయి. ఆ సమయంలో బంగారు వాకిలి లోపలికి అర్చకులు, జీయంగారు స్వామి, ఏకాంగితో పాటుగా సన్నిధి గొల్ల అనబడే ఒక యాదవుడూ మాత్రమే ప్రవేశిస్తారు. కాని అదే సమయంలో అశ్చర్యకరంగా ఒక దైవీకమైన పిల్లి క్రమం తప్పకుండా వీరితో పాటుగా బంగారు వాకిలిలో ప్రవేశిస్తుంది. ఇది శ్రీ వారి లీల మాత్రమే గాని మరియొకటి కాదు. ఈ గుడితో సంబధం ఉన్నటువంటి పూర్వికుల నుండి గ్రహించిన సమాచారం మేరకు ఈ పిల్లి సుమారుగా 100 సంవత్సరముల నుండి శ్రీ వారి గర్భాలయంలో వున్నట్టు తెలుస్తోంది. మాములుగా రాత్రి శ్రీ వారి ఏకాంత సేవ సమయంలో తలుపులు మూసి వేస్తారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు శ్రీ వారిని అర్చిస్తారని ప్రతీతి. ఆ సమయంలో గర్భాలయం ఎట్టి పరిస్థితుల్లోను లోపల ఎవ్వరు ఉండకుడదు. ఇది అనుచానంగా శ్రీ వారి ఆలయంలో వస్తున్న సంప్రదాయం. ఆశ్చర్యకరంగా ఈ పిల్లి కూడా ఈ నిబంధనను క్రమంతప్పక పాటిస్తుంది. ఆ తర్వాత తిరిగి సుప్రభాత సమయంలో నే అర్చకులతో పాటు ఈ పిల్లి లోనికి ప్రవేశిస్తుంది. ఈ పిల్లి శ్రీ వారికి నివేదించిన తర్వాత మాత్రమే ప్రసాదం స్వీకరిస్తుంది అది కూడా అర్చకులు పిల్లి చేసే సంజ్ఞలను గుర్తించి ప్రసాదాన్ని పిల్లి కోసం పెట్టినప్పుడు మాత్రమే అది స్వీకరిస్తుంది. అలాగే రాత్రి ఏకాంత సేవ సమయంలో శ్రీ వారికి నివేదించబడిన పాలు అర్చకులు ఇవ్వగా స్వీకరిస్తుంది. శ్రీ వారికి నివేదించని ప్రసాదాన్ని ఇది స్వీకరించదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. మరొక విషయమేంటంటే ఈ పిల్లి ఆయుర్దాయం తీరిన వెంటనే ఆ స్థానంలో మరొక పిల్లి శ్రీ వారి కైంకర్యం చేయడానికి సిద్ధంగా వుంటుంది. ఈవిధంగా స్వామివారు మనుష్యులతో పాటు జంతువులను కుడా కటాక్షిస్తున్నారని అక్కడి ఆలయ అర్చకులు పేర్కొన్నారు.

Exit mobile version