Home Health టూత్ పేస్ట్ ఉపయోగించి సౌందర్యం ఎలా పెంచుకోవచ్చో తెలుసా ?

టూత్ పేస్ట్ ఉపయోగించి సౌందర్యం ఎలా పెంచుకోవచ్చో తెలుసా ?

0

టూత్ పేస్ట్ అంటే దంతాలను శుభ్రపరుచుకోవడానికి మాత్రమే అని మనకు తెలుసు. కానీ టూత్ పేస్ట్ తో ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఇల్లు శుభ్రపరచడం నుండి అందానికి మెరుగులు పెట్టడం వరకు ఎన్నో రకాలుగా టూత్ పేస్ట్ ఉపయోగపడుతుంది. చర్మం కోసం టూత్ పేస్టులను ఇంట్లో తయారుచేసే చికిత్సగా భావించవచ్చు.

Toothpaste tips to enhance skin beautyఇది మొటిమలను ఎదుర్కోవటానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. మరి చర్మ సమస్యలకు టూత్‌పేస్ట్‌ను ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

->ఎక్కువ ఖర్చు చేయకుండా మీ చర్మాన్ని కాంతివంతం చేయడానికి కొద్ది మొత్తంలో టూత్‌పేస్ట్ తీసుకొని కొంచెం టమోటా రసంతో కలపండి. ఆపై మీ ముఖానికి అప్లై చేసుకుని 15 నిముషాల తర్వాత కడిగేయండి.

->జిడ్డుగల చర్మాన్ని టూత్‌పేస్ట్ సహాయంతో చికిత్స చేయవచ్చు. పేస్ట్, నీరు మరియు ఉప్పు కలిపి రాయాలి. ఈ చర్మ సమస్యను పరిష్కరించడానికి ప్రతి ఉదయం మీ ముఖాన్ని కడగాలి.

->నల్ల మచ్చలు లేకుండా నునుపైన చర్మం కొరకు ఒక టేబుల్ స్పూన్ టూత్ పేస్టు మరియు 2 చుక్కల నిమ్మరసం కలపండి. సుమారు 2 వారాల పాటు రోజూ మీ ముఖానికి అప్లై చేసుకోండి. ఫలితాల కోసం వేచి ఉండండి.

->టూత్ పేస్టుల సహాయంతో ముడతలు తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా ఆ ప్రదేశంలో కొద్దిగా టూత్‌పేస్ట్‌ను పూసి రాత్రిపూట అలా వదిలివేయండి. మరుసటి రోజు శుభ్రం చేసుకోండి. మంచి ఫలితం కనపడుతుంది.

->టూత్‌పేస్ట్ సహాయంతో డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవటం చాలా సులభం. మీరు టూత్‌పేస్ట్ ని డార్క్ సర్కిల్స్ మీద అప్లై చేయడం వల్ల అవి కొన్ని రోజులకు తగ్గిపోతాయి.

->కొంచెం టూత్‌పేస్టును ఒక గిన్నెలోకి వేసి, కాటన్ ను ఉపయోగించి మీ మొటిమల మచ్చలపై టూత్‌పేస్ట్‌ను కొద్దిగా రాయండి. 30 నిమిషాల తర్వాత కడగాలి. కొన్ని రోజుల పాటు ఇలా చేస్తే మీ ముఖం మీద మచ్చలు తొలగిపోతాయి.

->మీ బ్రష్‌పై కొంచెం టూత్‌పేస్టును పిండి దానికి కొంత తేనె కలపండి. సుమారు 5 నిమిషాలు మీ పెదాలను బ్రష్ తో శుభ్రపరచండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మీ పెదాలు మంచి కలర్ ను సొంతం చేసుకుంటాయి.

->మీకు ఏదయినా కీటకం కుడితే దానిమీద టూత్ పేస్టును రాస్తే దురద మరియు మంట నుండి మిమ్మల్ని కాపాడుతుంది. అంతేకాదు టూత్ పేస్ట్ మీ చర్మంపై కాలిన గాయాలను కూడా చల్లబరుస్తుంది.

->మీ నోటిని శుభ్రం చేసే టూత్‌పేస్ట్‌లోని పదార్థాలు మీ చేతుల్లో కూడా పని చేస్తాయి. మీ చేతులు దుర్వాసనతో కూడుకున్నట్లయితే టూత్‌పేస్ట్‌తో చేతులు కడుక్కోండి. అప్పుడు మీ చేతులు మంచి వాసన వస్తాయి.

->ముఖంపై వెంట్రుకలను తొలగించడానికి టూత్‌పేస్ట్, నిమ్మ రసం మరియు ఉప్పు లేదా చక్కెర కలిపి ఉపయోగించండి. ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై మసాజ్ చేయండి.

 

Exit mobile version