Home Health థైరాయిడ్ ఉంటె పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు వస్తాయా?

థైరాయిడ్ ఉంటె పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు వస్తాయా?

0
  • మన గొంతు దగ్గర సీతాకోక చిలుక ఆకారంలో థైరాయిడ్‌ గ్రంథి ఉంటుంది. శరీర అవసరాలకు సరిపడా హార్మోన్‌ను ఈ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్‌ అన్నది మన శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. మిగతా గ్రంథులు సక్రమంగా పనిచేయడానికి థైరాయిడ్‌ అనే ఎండోక్రైన్‌ చాలా అవసరం. తగిన మొత్తంలో ఈ స్రావం విడుదల కాకపోవడాన్ని హైపోథైరాయిడిజమ్‌ అంటారు.
1
  • థైరాయిడ్‌ హార్మోన్లలో సమతుల్యత లోపిస్తే, అది ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ హార్మోన్ల పనితీరును ఆటంకపరుస్తుంది. ​ఈ హార్మోన్స్ సరిగా ఉత్పత్తి కానప్పుడు శరీరంలో రీప్రొడక్టివ్ సామర్థ్యాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా ఎగ్ క్రియేషన్ లో సమస్యకు కారణమవుతుంది. తద్వారా అండం విడుదల జరగకపోవడంతో సంతాన సాఫల్య శాతం తగ్గిపోతుంది.
  • ఈ గ్రంథి స్రావం తక్కువగా ఉన్నవారిలో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటం, వచ్చినా గర్భం నిలవకపోవడం, నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం, ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తడం, పుట్టిన బిడ్డలో బుద్ధిమాంద్యం.. లాంటి సమస్యలు ఎదురవుతాయి.  థైరాయిడ్ హార్మోన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల.. మహిళల్లో ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతుంది. అంతేకాదు హైపోథైరాయిడిజం కారణంగా పాలు ఉత్పత్తి చేసే హార్మోన్ అయిన ప్రొలాక్టిన్ కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఎక్కువగా ఉత్పత్తి అయితే.. అండానికి సమస్యగా మారుతుంది.
  • వీటితోపాటు ప్రసవం తర్వాత తల్లి కుంగుబాటుకు గురికావొచ్చు. అయితే థైరాయిడ్‌ సరిగ్గా నియంత్రణలో ఉంటే మాత్రం కడుపులోని బిడ్డకు, తల్లికి ఎలాంటి ఇబ్బందులు రావు. మూడు నెలలకోసారి హార్మోన్‌ స్థాయులను పరీక్షించుకుంటూ నియంత్రణలో పెట్టుకోవాలి.  కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్‌, గైనకాలజిస్ట్‌ పర్యవేక్షణలో ఉంటూ దీన్ని నియంత్రించుకోవాలి.
  • అంతే తప్పించి, థైరాయిడ్‌ సమస్య ఉన్నంత మాత్రాన వందశాతం సంతానలేమి అంటూ ఉండదు. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతూ, జీవన శైలిలో మార్పులు చేసుకుంటే తప్పకుండా గర్భం ధరించవచ్చు. అయితే థైరాయిడ్‌తో ఇబ్బందిపడుతున్న వారైనా, ఇతర మహిళలైనా గర్భం నిర్ధారణ అయిన వెంటనే థైరాయిడ్‌ ఫంక్షనింగ్‌ టెస్ట్‌ (టీఎఫ్‌టీ) చేయించుకోవాలి.
  • ​అప్పుడే, వైద్యులు ఆ గర్భవతికి ఏ తరహా చికిత్స చేయాలన్నది నిర్ధారిస్తారు. అలాకాకుండా గర్భం దాల్చాక కూడా థైరాయిడ్‌ను నియంత్రణలో ఉంచుకోకపోతే, పుట్టబోయే బిడ్డలో అవయవ లోపాలు వస్తాయి. గర్భవిచ్ఛిత్తి జరుగవచ్చు, పిండంలో ఎదుగుదల ఆగిపోవచ్చు, కడుపులోనే బిడ్డ చనిపోవచ్చు. అందువల్ల, ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి.
ఈ సమస్య ఉంటే కచ్చితంగా థైరాయిడ్‌ మాత్రలతోపాటు సెలీనియం ఉన్న ప్రీనేటల్‌ క్యాప్సుల్స్‌ను తప్పనిసరిగా వాడాలి. థైరాయిడ్‌ స్థాయులు 2.5 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

Exit mobile version