Home Unknown facts బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు గురించి మీకు తెలియని వాస్తవాలు..

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు గురించి మీకు తెలియని వాస్తవాలు..

0

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ప్రముఖ ప్రవచన కర్తగా మనందరికీ తెలుసు.. లక్షలాదిమంది అభిమాన ఘణం. చాగంటి వారి ధార్మిక ఉపన్యాసాలు వినడానికి జనం ఎగబడతారు అనటంలో అతిశయోక్తి లేదు.. అయితే తన ప్రవచనాలతో ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నప్పటికీ ఇసుమంతైనా గర్వం ఏర్పడని సున్నిత స్వభావులు.. మన ఇతిహాసాల గురించి, సంస్కృతీ సంప్రదాయాల గురించి అద్భుతంగా ఇప్పటి జనరేషన్ కు అర్ధమయ్యే రీతిలో చక్కగా వివరిస్తారు.. పురాణాలను పుక్కిట పట్టినట్లుగా చాగంటి వారు చేసే వివరణ వారిని అగ్రస్థాయిలో నిలిపింది. సొంత లాభాపేక్షతో సందుకో స్వామీజీ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో కూడా చాగంటి వారు చెప్పే ప్రవచనాలకు ఎటువంటి ధనాన్ని ఆశించరు. అంతే కాదు ఇలా పదిమందికి ఉపయోగపడేలా నాలుగు మంచిమాటలు చెప్పటం నా అదృష్టం అని చెప్తారు.. తనకున్న అపారజ్ఞానాన్ని ధనం కోసం తాకట్టు పెట్టని మహర్షి చాగంటివారు. తన విద్యను రాజులకు అమ్ముకోని వారిలో అప్పట్లో బమ్మెర పోతన తరవాత చాగంటివారే అని చెప్పాలి.. చాగంటి వారు చేస్తున్న సేవలకు గానూ చైన్నైలోని భారతీయ సాంస్కృతిక పీఠం నిర్వాహకులు ‘ప్రవచన బ్రహ్మ’ బిరుదును ప్రదానం చేశారు. అయితే బిరుదులంటే బెరుకుగా ఫీలయ్యే చాగంటి గారు చైన్నైలోని భారతీయ సాంస్కృతిక పీఠం తల్లిలాంటిదని, అమ్మప్రేమత్వాన్ని తలపించేలా ‘నా బంగారు కొండ’ అంటూ తల్లి తన బిడ్డను ముద్దాడినట్టుగా భావించి ఈ బిరుదును స్వీకరిస్తున్నానని ఆ సమయంలో పేర్కొన్నారు. ఇలా చాగంటి వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గురించి మనం ఇపుడు తెల్సుకుందాం..

Chaganti Koteswara Raoచాగంటి వారు ప్రభుత్వ ఉద్యోగి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. మరి ఎప్పుడూ అక్కడా ఇక్కడ ప్రవచనాలు చెప్తుంటారు.. ఆఫీస్ కి ఎప్పుడు వెళ్తారు అనే సందేహం కలుగక మానదు.. అయితే చాగంటివారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు. అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో. ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు. ఇక కుటుంబ వివరాలకొస్తే చాగంటి వారి సతీమణి వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి. వీరికి ఒక కుమారుడు. ఇటీవలనే అతడికి వివాహం జరుగగా… కొడుకు, కోడలు హైదరాబాద్ లో సాఫ్ట్ వెర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులోనే తండ్రి గారు గతించారు. ఆయనకు ముగ్గురు తోబుట్టువులు.. ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కష్టపడి నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేసారు… వారికి ఆస్తిపాస్తులు లేవు. కడు పేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అని తెల్సుకున్న చాగంటి వారు అహోరాత్రాలు కష్టపడి విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచి యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు. ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు అన్నీ తానై తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు. ఈరోజు వరకు తనకంటూ బ్యాంకు బాలన్స్ ఉంచుకోలేదంటే ఎవరు నమ్మరు.. కానీ అదే నిజం.. ఆయనకున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు. ఈరోజు వరకు ఆయన మధ్యతరగతి జీవే. అలా ఉండటానికే ఇష్టపడతారు..

చాగంటి వారు తనకున్న ప్రతిభాసంపత్తిని సొమ్ము చేసుకోదలచినట్లైతే ఈపాటికి ఆయన కొన్ని వందల ఎకరాల భూములు, ఇల్లువాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు. కానీ ప్రవచనాలకు ఆయన నయాపైసా పారితోషికం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్పించి నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు. ఇంతవరకు ఆయనకు కారు లేదు. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు. చాగంటి వారు పని చేసే ఎఫ్ సి ఐ డైరెక్టర్ క్రైస్తవుడు. అయినా చాగంటి వారు ఆఫీసుకు వెళ్ళగానే ఆయనే స్వయంగా వచ్చి చాగంటి వారికి నమస్కారం చేస్తారు. సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటివారు ఎప్పుడు వాటిని వాడుకోరు.. సెలవు పెట్టరు.. వారాంతపు సెలవు దినాల్లో మాత్రమే ప్రవచనాలు చెప్తుంటారు..

చాగంటి వారేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు అవపోసన పట్టారని చాలామంది పొరపడతారు. కానీ అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అని, ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం అని చెప్పాలి.. ఎందుకంటే ఎంత సాధన చేసిన ఇలాంటి విషయాలు ఎక్కువకాలం గుర్తుండవు.. కానీ చాగంటి వారి లాంటి వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం.

కాకినాడలోని అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అందుకే ఆయనకు అభిమానులు పెరిగారు. అభిమానులు అనేకంటే భక్తిగా ఆరాధిస్తారు అనాలేమో.. 1998 లో వారి తల్లిగారు స్వర్గస్తులు అయ్యాక చాగంటి వారు బయటప్రాంతాల్లో ప్రవచనాల్ని ఇవ్వటం ప్రారంభించారు.

తాను ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకోకుండా చాగంటి వారిని కలిసిన పీవీ నరసింహారావు గారు “మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను” అని అడుగగా.. చాగంటి వారు నవ్వేసి “మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు.” అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.

ఎన్నో ఏళ్ళనుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు. అయితే ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు మాత్రమే.. త్వరలో చాగంటి వారు రిటైర్మెంట్ కానున్నారు..

చాగంటివారికి బీపీ, మధుమేహం, మోకాళ్లనొప్పులు ఉన్నాయి. ప్రవచనాలు చెప్పీ చెప్పీ ఆయన కంఠనాళాలు దెబ్బతిన్నాయి. ప్రవచనాలను తగ్గించుకోమని డాక్టర్లు సూచించానప్పటికీ . ప్రవచనాలు చెబుతూ కన్నుమూస్తే అంతకంటే కావలసింది ఏముంది? అని అలాగే తన ప్రవచనాల్ని కొనసాగిస్తున్నారు..

చాగంటి వారికీ చాదస్తం పాలు ఎక్కువ అని కొందరు అభిప్రాయపడతారు. చాగంటివారు ఏది చెప్పినా దానికి శాస్త్రమే ప్రమాణం తప్ప స్వకపోలకల్పితం కాదు. తన ప్రవచనాలను వినమని ఆయన ఎవ్వరిని బలవంతం చెయ్యడం లేదు. ఇష్టమైనవారు వింటారు లేనివారు లేదు. ఆనాటి ఆచారాలు, పద్ధతులు ఆయన చెబుతారు. ఇష్టమైన వాళ్ళు పాటిస్తారు.. చాగంటి వారంటే గిట్టనిఈర్ష్య పరులు FCI ఉన్నతాధికారులకు చాగంటివారి మీద అనేక ఆరోపణలు చేస్తూ ఆకాశరామన్న ఉత్తరాలు కూడా రాసేవారట.. అయితే చాగంటి వారి రికార్డు తెలిసిన యాజమాన్యం ఆ లేఖలు ఏమాత్రం పట్టించుకోలేదు..

ఇక ప్రవచనాలను ఇలా ఉచితంగా ఇవ్వద్దని, ఎంతోకొంత పుచ్చుకోమని, బంధువులు, మిత్రులు చాగంటివారిపై ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ . ససేమిరా అన్నారు చాగంటివారు. ఆయన ప్రవచనాలను కాసెట్లుగా, సీడీలుగా అమ్ముకుని లక్షలరూపాయలు ఆర్జించాయి కొన్ని కంపెనీలు. కనీసం వాటికీ కూడా రాయల్టీ ఆశించని మహానుభావులు.. చాగంటివారికి ఏర్పడిన ప్రజాదరణను చూసి, ఆయనను ప్రభుత్వ సలహాదారుగా కూడా నియమించారు చంద్రబాబు. కానీ పదవితో వచ్చే భోగాలను, సౌకర్యాలను అందుకోలేనని.. ఈ రోజుకి ఆ పదవిని స్వీకరించలేదు.. దేవాదాయశాఖామంత్రి స్వయంగా ప్రభుత్వ కారును, సెక్యూరిటీని స్వీకరించమని కోరినా తిరస్కరించారు. అంతటి మహానుభావులైన చాలా సామాన్య జీవితాన్ని మాతరమే కోరుకుంటారు..

Exit mobile version