Home Unknown facts దుర్వాస మహర్షి పుట్టుక వెనుక ఉన్న పురాణ కథ

దుర్వాస మహర్షి పుట్టుక వెనుక ఉన్న పురాణ కథ

0

ఎవరికైనా మాటిమాటికి కోపం వస్తుంటే దుర్వాస మహర్షితో పోలుస్తారు. కారణం ఆయన కోపం పురాణాల్లో విష్ణుమూర్తి తో సహా చాలామందిని కోపంలో శపించారు. అసలు దుర్వాస మహర్షికి అంతటి కోపం ఉండడానికి కారణం తెలుసుకుందాం.

Durvasa Maharshiదుర్వాసుడి పుట్టుక గురించి పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. వాటిలోని ఒకానొక కథను అనుసరించి, ఒక సారి బ్రహ్మకు, శివుడికి మధ్య మాటామాటా పెరిగి పెద్ద రాద్థాంతం అయ్యింది. పరమేశ్వరుడు ప్రళయరుద్రుడు అయ్యాడు. ఆయన కోపాగ్ని జ్వాలలకు దేవతలు తల్లడిల్లిపోయారు. పార్వతి సైతం తన భర్త కోపాన్ని భరించలేక, శివుణ్ని చేరి ‘దుర్వాసంభవతిమి’ అంటే మీతో కాపురం చేయడం కష్టమైపోతోంది’ అంటూ వాపోయింది.

అప్పుడు రుద్రుడు తన కోపాన్నీ, ఉద్రేకాన్నీ మరొకరిలో ప్రవేశపెట్టి పార్వతిని సంతోషపెట్టాలనుకున్నాడు. తరువాత జరిగిన ఒకానొక సంఘటనలో త్రిమూర్తులు అనసూయా దేవికి ప్రత్యక్ష్యమై ఏదైనా వరం కోరుకొమ్మన్నారు. అప్పుడు ఆ మహా సాధ్వి ‘ మీ ముగ్గురి దివ్యాంశలతో నాకు బిడ్డలు కలగాలి.’ అని కోరుకుంది. వారు సరేనన్నారు. ఆ ప్రకారం బ్రహ్మ అంశతో చంద్రుడు, మహా విష్ణువు అంశతో దత్తాత్రేయుడు కలిగారు. ఆగ్రహాన్ని శివుడు అనసూయలో ప్రవేశపెట్టగా, ఆ కోప స్వభావునిగా, అనసూయకు దుర్వాసుడు పుట్టాడు. అలా కోపానికి మారుపేరయ్యాడు. ప్రళయ రుద్రుని అంశగా జన్మించిన కారణంగానే అంతటి కోపం దుర్వాసుడికి ఉండేది.

 

Exit mobile version