Home Unknown facts పూజగదిలో మరణించిన వారి ఫోటోలు పెట్టవచ్చా ?

పూజగదిలో మరణించిన వారి ఫోటోలు పెట్టవచ్చా ?

0

కొంతమంది పూర్వీకుల మీద ఉన్న గౌరవంతో పూజగదిలో మరణించిన తాత ముత్తాతల ఫోటోలు పెడుతుంటారు.అయితే అది సరికాదని వాస్తు నిపుణులు అంటున్నారు. చాలామంది పెద్దలకు గౌరవం ఇచ్చే భావనతో పూజగదిలో మరణించినవారి ఫోటోలు పెడుతుంటారు.

పూజగదికానీ అవి మన దృష్టిని, ఆలోచనలను మరల్చడమే కాకుండా బాధాకరమైన జ్ఞాపకాలను తెప్పిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. అందుచేత తాత ముత్తాతల ఫోటోలను హాల్లో కాస్త ఎత్తుగా లైట్ల డెకరేషన్‌తో అమర్చుకోవడం మంచిది.

అలాగే పూజ గదిలో గంటను ఏర్పాటు చేయడం సరికాదు. పూజ గది ఆలయం కాదు. అది మన వ్యక్తిగత ధ్యానానికి, పూజకు ఉద్దేశించింది కనుక పెద్ద శబ్దాలు లేకుండా ఉండటం మంచిది. పూజ గదిలో డబ్బు, ఇతర విలువైన వస్తువులను అక్కడ దాచడం సరికాదు. పూజ గది కప్పు కొద్దిగా కిందకి ఉండేలా చూసుకోవాలి.

పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఆ గదికి ఎప్పుడూ రెండు తలుపులు ఉన్న ద్వారాన్నే పెట్టుకోవాలి. అలాగే పూజ గదికి తప్పనిసరిగా గడప ఉండాలి. అలాగే పూజ గదికి లేత రంగులే వేయాలి. తెలుపు, లేత పసుపు లేదా లేత నీలాన్ని ఎంచుకోవచ్చు.

Exit mobile version