గరుడ పురాణం గురించి చాలామంది వైన్ వుంటారు.. మన పూర్వ కర్మలకు ఫలితాలు, మనం చేసే పాపాలకు ఎలాంటి శిక్షలు పడతాయి అని ఇందులో తెలుపబడి ఉంటుంది..
గరుడ పురాణం అనగానే చాలామంది భయపడుతుంటారు.. అయితే పూర్వం నుండి వస్తున్న గ్రంధాలైనా పురాణాలైన మానవుల్ని ధర్మ పరాయణులుగా ముందుకు నడిపేటందుకే అని అందరం గుర్తుంచుకోవాలి.. అయితే గరుడ పురాణంలో చెప్పినట్లు కొన్ని పనుల వలన మన జీవిత కాలం అంటే ఆయుష్షు తగ్గుతుంది.. అలంటి పనులు చేయకుండా ఉంటె జీవితం బావుంటుందని చెప్తారు.. మరి ఎలాంటి పనులు చేస్తే ఆయుష్షు తగ్గుతుందో తెల్సుకుందాం..
భగవంతుని యొక్క శక్తిని విశ్వసించని వారు, ధర్మ, కర్మల మార్గాన్ని అనుసరించని వారి ఆయుర్దాయం తగ్గిపోతుందట. భగవంతుడిని నమ్మడం, నమ్మకపోవడం అనేది మానవాళి ఇష్టం.
కొంతమంది వృద్ధులను ఎగతాళి చేయడం మరియు అవమానించడం వంటివి చేస్తుంటారు. దాని యొక్క పరిణామాల వల్ల మీ జీవిత కాలం సగానికి తగ్గిపోతుందట. చుట్టుపక్కల మహిళలు మరియు పిల్లలపై ద్వేషపూరిత ఆలోచనలతో, ఇతరులపై ద్వేషంతో జీవించడం మీ జీవితాన్ని తగ్గిస్తుందని గరుడ పురాణం చెబుతోంది. మానవాళిని తృణీకరించే వారు మనుషులుగా జీవించడానికి అర్హులు కాదు. అలాగే మీ వెన్నెముకను వంచి కూర్చున్నపుడు, కటి అంతస్తు ముందుకు తిరుగుతుంది. ఇలా మీ వెన్నెముకను వంచి కూర్చుంటే, వెనుక భాగంలో ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది అనేక వ్యాధులకు దారితీస్తుంది. దీని వల్ల మీ ఆయుష్ తగ్గిపోతుందట.
మన ఇంట్లో ఎప్పుడైనా అద్దం కొంచెం చీలినా.. లేదా ముక్క విరిగిపోయినా పెద్దలు వెంటనే బయటపడేయండని చెబుతుంటారు. ఎందుకంటే మాత్రం చెప్పరు. ఇంకా కొంతమంది ఇది దరిద్రం అని చెబుతుంటారు. అయితే అసలు నిజం ఏంటంటే గరుడ పురాణం ప్రకారం, విరిగిన అద్దం మీరు ఉండే ప్రదేశంలో ఉంటే మీ ఆయుష్షు తగ్గుతుంది.. అలాగే మీరు తప్పుడు దిశలో నిద్రపోయినా కూడా మీ జీవిత కాలం తగ్గిపోతుందట. మీ తలను ఉత్తరం లేదా నైరుతి దిశలో పెట్టి ఎప్పుడూ నిద్రపోకండి.