Home Unknown facts ఈ ఆలయంలో పాటించే వింత ఆచారాలు ఏంటో తెలుసా ?

ఈ ఆలయంలో పాటించే వింత ఆచారాలు ఏంటో తెలుసా ?

0

మనదేశంలో మూఢనమ్మకాలకు, దురాచారాలకు కొదువేలేదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, చదుకునే వాళ్ళ సంఖ్యా రోజు రోజుకు పెరుగుతున్నా మూఢనమ్మకాలకు క్రేజ్ తగ్గట్లేదు. అలాంటి ఒక వింత ఆచారం గురించి ఈరోజు తెలుసుకుందాం.

కుక్కే సుబ్రమణ్య దేవాలయంమన పక్కరాష్ట్రం కర్నాటక లోని కుక్కే సుబ్రమణ్య దేవాలయంలో ఈ వింత ప్రతి సంవత్సరం జరుగుతుంది. అక్కడ పుణ్యం పేరిట ఒక వింత జరుగుతుంది. ఎంగిలాకుల మీద పొర్లు దండాలు పెడితే చాలట ఎలాంటి చర్మ వ్యాధులైన ఇట్టే మాయమవుతాయట.

కుక్కే సుబ్రమణ్య దేవాలయం మంగళూరు దగ్గరలోని సుళ్యా అనే ఊర్లో కలదు. సుబ్రమణ్య స్వామిని ఇక్కడ నాగ దేవత గా ఆరాధించడం విశేషం. కుమారధారా నది మీద వున్న సుబ్రహ్మణ్య స్వామి వూళ్ళో వున్న సుబ్రహ్మణ్య దేవాలయం లేక కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలలో ఒకటి.

‘మాదే స్నాన’, ఇక్కడి ప్రధాన వింత ఆచారం. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించే చంపా షష్టి వేడుక లేదా ఉత్సవం నాడు మూడు రోజులపాటు ‘మాదే స్నాన’ జరుపుతారు. ఈ ఆచారం ప్రకారం మొదట బ్రాహ్మణులు విస్తరాకులలో భోజనం చేస్తారు. వారు తిని వదిలేసిన ఆకులను అక్కడే ఉంచుతారు. ఊర్లోని ప్రజలందరూ వచ్చి ఆ ఆకుల పై ‘పొర్లు దండాలు’ పెడతారు. ఇలా చేస్తే వారి చర్మ వ్యాధులు తగ్గిపోతాయని, వారి పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

ఈ ఆచారాన్ని పాటించే వారిలో అత్యున్నత చదువులు చదివిన వారు సైతం ఉండటం గమనార్హం. మధ్యతరగతి కుటుంబీకులు, టీచర్లు, ఇంజనీర్లు, వైద్యులు, న్యాయవాదులు ఇలా ఎందరో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

Exit mobile version