Home Unknown facts శ్రీ మహావిష్ణువు భక్తురాలు తులసీగా మారి పూజలు ఎందుకు అందుకుంటుంది?

శ్రీ మహావిష్ణువు భక్తురాలు తులసీగా మారి పూజలు ఎందుకు అందుకుంటుంది?

0

తులసి మొక్కని పవిత్రంగా, దైవంగా భావిస్తూ ఆడవారు ప్రతి రోజు తులసి మొక్కకు పూజలు చేస్తుంటారు. అయితే పురాణం ప్రకారం విష్ణువు భక్తురాలైన వృందా తులసీగా ఒక దేవతగా ఎలా మారింది? ఆమె ఎందుకు విష్ణువుని శపించదనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Maha Vishnuహిందూ పురాణాలలో తులసిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడి అందమైన కూతురు, యువరాణి. పరమశివుని ముఖ్యభాగం జలంధర్ ను ఆమె పెళ్ళాడుతుంది. శివుని మూడోకన్ను లోంచి పుట్టిన అగ్నిలోంచి పుట్టడం వలన జలంధర్ కి అపారశక్తి ఉన్నది. జలంధర్ ఎంతో పవిత్రం, భక్తురాలైన స్త్రీ అయిన యువరాణి వృందను ప్రేమిస్తాడు. వృంద మహావిష్ణువు పరమభక్తురాలు, జలంధర్ ఏమో అందరు దేవుళ్ళను అసహ్యించుకునేవాడు. కానీ విధి వల్ల ఇద్దరూ పెళ్ళాడతారు. నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి, పవిత్రత వల్ల అతని శక్తి మరింత పెరిగిపోయింది. పరమశివుడు కూడా జలంధర్ ను ఓడించలేకపోతాడు. అతని మూర్ఖత్వం పెరిగిపోయి పరమశివునే ఓడించి విశ్వానికి అధిపతి కావాలనుకుంటాడు.

దేవతలు జలంధర్ శక్తులను చూసి భయపడతారు. వారు విష్ణుమూర్తి వద్దకు సాయం కోసం వెళ్తారు. విష్ణుమూర్తి, వృంద తన భక్తురాలు కావటంతో, ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్థంలో పడతాడు. కానీ జలంధర్ వల్ల జరిగే నష్టం వల్ల మహావిష్ణువు ఒక మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు. జలంధర్ పరమశివునితో యుద్ధంలో ఉండగా, విష్ణువు వృంద వద్దకు జలంధర్ రూపంలో వస్తాడు. వృంద అతన్ని గుర్తుపట్టలేక అతన్ని జలంధర్ అనే భావిస్తుంది. మహావిష్ణువు తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది. ఆమె పతివ్రత నిష్ట భగ్నం అయి, జలంధర్ బలహీనుడవుతాడు. తన తప్పు తెలుసుకుని, వృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తనని మాయ చేసాడని తెలిసి బాధపడుతుంది.

మహావిష్ణువు మారురూపం తెలుసుకుని, తన పవిత్రతపై జరిగిన మోసానికి వృంద మహావిష్ణువుని శపిస్తుంది. అతన్ని రాయికమ్మని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు. దీని తర్వాత, జలంధర్ పరమశివుని చేతిలో హతుడవుతాడు. వృంద కృంగిపోయి, తన జీవితాన్ని కూడా ముగించాలనుకుంటుంది.

వృంద చనిపోయే ముందు, విష్ణుమూర్తి ఆమె తులసిగా పిలవబడి, తనతో పాటు పూజించబడుతుందని వరం ఇస్తాడు. ఆయనను తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవ్వదు. అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీయలేని భాగం అయిపోయింది.

Exit mobile version