“Telugu Cinema saankethinga malupu tirigina pratisari Krishna Gari mudra vuntundi”. Yes, nijame Telugu cinema technology paramga munduki velladaniki one of the main reason Superstar Krishna gare. Thana legendary cini career lo enno experiments cheyyadaniki karanam “Mosagallaku Mosagadu” ane movie. Aa time lo Mosagallaku Mosagadu movie cheyyadam entho risk tho kudina pani asalu mana audience chustaro ledo kuda telidu aina Krishna Garu dairyam chesaru thane swayamga producer ga maari ee movie ni janala mundhuki teesukocharu. Ee never say die attitude undi kabatte Superstar ayyaru. Asalki ee “Mosagallaku Mosagadu” speciality enti anukuntunnara?
Don’t worry check out these unknown facts & records of “Mosagallaku Mosagaadu”
1) First Indian Western Film // Cowboy Film
” సోదరుడు శ్రీకృష్ణ తీసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా చూశాను.. ఎంతో ప్రయాసకు లోనై విశిష్టమైన సాంకేతిక విలువతో, ఈ చిత్ర నిర్మాణం జరగాలన్న ధ్యేయం, పట్టుదల ప్రతి షాటులోనూ, ప్రతి ఫ్రేములోనూ కనిపించింది. తెలుగు భాషలో చూస్తున్న ఇంగ్లీష్ చిత్రమా అనిపించింది . ముఖ్యంగా ప్రశంసించదగినది ఛాయాగ్రాహణము.. ఇంత మామోజ్ఞంగా ఉన్నత ప్రమాణంలో కెమెరాను ఉపయోగించిన శ్రీ స్వామి అభినందనీయుడు.. కథకు అనుగుణమైన వేగంతో దర్శకత్వం నిర్వహించిన శ్రీదాసు ప్రశంసాపాత్రుడు. ఇంత సాంకేతిక విలువలతో జాతీయత.. మన సాంఘిక వాతావరణం ప్రతిబింబించే అభ్యుదయ భావ పూరితములైన మహత్తర కళాఖండాలను అభిమానులకు శ్రీకృష్ణ అందించగలరని ఆశిస్తూ.. సాహసోపేతమైన యీ చిత్ర నిర్మాణ కృషికి అతన్ని అభినందిస్తున్నాను.