Home Health మేకప్ చేసుకునేటప్పుడు సాధారణంగా అందరూ చేసే పొరపాట్లు!

మేకప్ చేసుకునేటప్పుడు సాధారణంగా అందరూ చేసే పొరపాట్లు!

0

మేకప్ అనేది ఇప్పుడు అమ్మాయిల లైఫ్ స్టైల్ లో ఒక భాగమైపోయింది. ఇది వారిని అందంగా కనిపించడంతో పాటు ఆత్మవిశ్వాసంతో కనిపించేలా చేస్తుంది. అందుకే ఈ మధ్య చాలామంది. యూట్యూబ్ లోనూ, ఫేస్బుక్ లోనూ మేకప్ వీడియోలు చూస్తూ మేకప్ వేసుకోవడం నేర్చుకుంటున్నారు.

use a moisturizer before applying makeupఅయితే వీడియోలో చూపించిన ఉత్పత్తులనే ఉపయోగిస్తే, మీరు వేసుకున్న మేకప్ మీకు అంత అందాన్ని ఇవ్వలేకపోవచ్చు. దానికి కారణం మేకప్ ఉత్తత్తులు ఎంచుకోవడంతో పాటు.. మేకప్ వేసుకునే విషయంలో కొన్ని పొరపాట్లు చేయడమే. అవేంటో తెలుసుకొని సరిదిద్దుకుంటే అందంగా మేకప్ వేసుకోవచ్చు.

మేకప్ కి ముందు మాయిశ్చరైజర్ ఉపయోగించకపోవడం:

మేకప్ వేసుకోవడానికి ముందు చాలా మంది తమ చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోరు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అలా రాసుకోవాలని తెలియకపోవడం కావచ్చు. లేదా ఇన్ని ప్రొడక్ట్స్ అప్లై చేసుకునేటప్పుడు ఇంకా దాని అవసరం ఏముందనే ఆలోచన కావొచ్చు. కానీ మనం వేసుకునే మేకప్ అందంగా రావాలంటే మాత్రం మాయిశ్చరైజర్ రాసుకోవాల్సిందే. అలాగే వయసు పెరిగే కొద్దీ చర్మం కూడా పొడిగా మారిపోతుంది. ఇలాంటి చర్మంపై మాయిశ్చరైజర్ రాసుకోకుండా మేకప్ వేసుకుంటే అది పొడిపొడిగా కనిపిస్తుంది.

చర్మతత్వం తెలుసుకోకుండా పౌండేషన్ వాడటం:

ఒక్కొక్కరి చర్మం రంగు, తత్వం ఒక్కోలా ఉంటుంది. దానికి తగినట్టుగానే మీరు ఎంచుకునే ఫౌండేషన్ షేడ్ ఉండాలి. ఖరీదైనవే కదా అని ఏది పడితే అది వాడితే అందంగా కనిపించడం మాట అటుంచి చర్మ పాడవుతుంది.

ఫౌండేషన్ కు మ్యాచ్ కాని కన్సీలర్ వాడడం:

మనం ఉపయోగించే ఫౌండేషన్, కన్సీలర్ వేర్వేరు షేడ్లు అయితే ఫౌండేషన్ పై కన్సీలర్ అప్లై చేసిన చోట ఏదో పూత పూసినట్టు ఉంటుంది. కాబట్టి ఫౌండేషన్ ఏ షేడ్లో ఉందో కన్సీలర్ కూడా అదే షేడ్ ది ఎంచుకోవాల్సి ఉంటుంది.

లిప్ స్టిక్ కొనే ముందు టెస్ట్ చేయకపోవడం:

మిగిలిన మేకప్ ఉత్పత్తులు కొనే ముందు ఎలా టెస్ట్ చేస్తామో… లిప్ స్టిక్ కూడా అలాగే టెస్ట్ చేసి కొనాలి. అప్పుడే కదా అది మీకు నప్పిందో లేదో తెలుస్తుంది. ఒకే రంగు ఇద్దరు అప్లై చేసుకున్నప్పుడు అది వేర్వేరుగా కనిపిస్తుంది. కాబట్టి కొనే ముందు కాస్త చేతి మీద రాసి చూడండి. అది మీకు సరిగా నప్పుతుంది అనుకుంటేనే తీసుకోండి.

 

Exit mobile version